Budget 2024: ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌..

ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య.. పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఎలాంటి మెరుపులు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న NDA సర్కార్‌.. ఇవాళ్టి యూనియన్‌ బడ్జెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది.

Budget 2024: ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌..
Budget 2024
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 23, 2024 | 2:57 PM

ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య.. పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఎలాంటి మెరుపులు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న NDA సర్కార్‌.. ఇవాళ్టి యూనియన్‌ బడ్జెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది. ఆర్థికరంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి చర్యలుంటాయ్‌..? ట్యాక్స్‌ పేయర్స్‌కి వచ్చేదేంటి..? ధరల నియంత్రణకు ఏం చేస్తారు..! యువత, రైతులు, మహిళలకు కొత్తగా ఏం చేయబోతున్నారు..! అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

3వ సారి మోదీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

వరుసగా ఏడోసారి బడ్జెట్‌ సమర్పించనున్నారు నిర్మలా సీతారామన్..

ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం.. మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ ఇవాళ సభ ముందు ఉంచబోతోంది.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే కొన్ని సెక్టార్‌లకు భారీ కేటాయింపులు ఉండొచ్చంటున్నారు.

రక్షణ రంగానికి కేటాయింపులు పెరగొచ్చు.. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, హెల్త్‌కేర్‌కి సంబంధించి, అలాగే రైల్వేస్‌కి ఊతమిచ్చేలా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూనే.. హైవే ప్రాజెక్ట్స్‌కీ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇప్పటికే వచ్చాయి.

ఇంధన రంగానికి కావచ్చు.. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి సంబంధించి కావచ్చు.. ఎలాంటి కేటాయింపులు, రాయితీలు ఉంటాయనేదానిపై ఆసక్తి నెలకొంది.

MSMEలకు చేయూత ఇచ్చేలా నిర్ణయాలకు ఛాన్స్ ఉందంటన్నారు.

ట్యాక్స్‌పేయర్లు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తారని అంచనాలున్నాయి.

ఏటా 80 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేసిన నేపథ్యంలో దాని యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో వివరించబోతున్నారు.

ట్యాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం 12 నుంచి 15 లక్షలు మధ్య ఆదాయం ఉంటే 20 శాతం పన్ను ఉంది.

ఈ స్లాబ్‌లో పన్ను 10 శాతానికి తగ్గిస్తారా..? ఏం చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

స్టాండర్డ్ డిడక్షన్స్‌ విషయంలో ఎలాంటి మార్పులు చేస్తారనేదాని కోసం వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బడ్జెట్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టీవీ9లో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం