Viral: ఏడాది క్రితం గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన IAS అధికారి భార్య.. తాజాగా ఇంటికి వచ్చి
ఆమె ఐఏఎస్ అధికారి భార్య.. ఓ గ్యాంగ్ స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది. భర్త వారించడంతో.. గ్యాంగ్‌స్టర్‌తో కలిసి లేచిపోయింది. కొన్నాళ్లు అతనితోనే ఉంది. తాజాగా ఇంటికి తిరిగొచ్చింది...
ఆమె ఓ IAS ఆఫీసర్ భార్య. సివిల్ సర్వెంట్ భార్యగా సమాజంలో ఎన్నో గౌరవ మర్యాదలు దక్కుతాయి. కానీ ఆమె మాత్రం తప్పుడు మార్గంలో పయనించింది. ఓ గ్యాంగ్ స్టర్‌తో సన్నిహితంగా మెలిగింది. అతడితో కలిసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడింది. బాగోతం బయటపడి.. అరెస్ట్ చేసే సమయంలో.. సదరు గ్యాంగ్ స్టర్‌తో కలిసి పారిపోయింది. దీంతో భర్తకు.. ఆమె ప్రవర్తనపై విరక్తి పుట్టింది. విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. విషయం తెలిసి.. తిరిగి ఇంటికొచ్చిన ఆమె సూసైడ్ చేసుకుంది. గుజరాత్ గాంధీనగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.
గుజరాత్ కేడర్‌కు చెందిన IAS ఆఫీసర్ రణ్‌జీత్‌కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి.. కొన్నాళ్ల కిందట తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ పరిచయమయ్యాడు. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ కలిసి కొన్ని నేరాలకు పాల్పడ్డారు. 9 నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి.. ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా.. అక్కడ పోలీసులు అలర్టై ఆ బాలుడ్ని సేవ్ చేశారు. అప్పటినుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం సూర్య జై గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్ ఇంటికి వచ్చింది. కానీ ఆ అధికారి.. ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో విషం తాగిన సూర్య జై 108కు కాల్ చేసి విషయం చెప్పింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది.
ఘటనపై రణ్‌జీత్ తరఫు న్యాయవాది స్పందించారు. దంపతులిద్దరూ ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. రణ్‌జీత్ విడాకుల కోసం అప్లై చేశారని… గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పినట్లు వెల్లడించారు. రణ్‌జీత్ తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కాగా.. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా భర్త రణ్‌జీత్ నిరాకరించినట్లు తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..