15 రోజుల పాటు చక్కెర మానేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

మీ ఆహారంలో చక్కెర తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తీపి కోసం మీరు చక్కెరకు బదులుగా తేనె, బార్లీ సైరప్, లేదా స్టీవియా వంటి చక్కెర-రహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం అలవాటు చేసుకోండి.

15 రోజుల పాటు చక్కెర మానేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
Sugar
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 25, 2024 | 7:56 AM

చక్కెర వాడకం మంచిది కాదని ఎంత చెప్పినా.. మనం చీమల్లాగా.. చక్కెర పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటాము. అయితే, మనం తీసుకునే ఆహారంలో చక్కెర మోతాదు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ చక్కెర వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం ఖాయమంటున్నారు.. అందుకే ఒక రెండు వారాలపాటు చక్కెర మానేసి చూడండి.. మీ ఆరోగ్యంలో మార్పులు మీకే అర్థమవుతాయి. ఓ పదిహేను రోజుల పాటు చక్కెరను.. మనం దూరం పెడితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

చక్కెరతో చేసే ఆహార పదార్థాలు నోటికి రుచిగా ఉన్నా దాని వెనుక ఎన్నో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక పదిహేను రోజుల పాటు చక్కెర వాడకాన్ని మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులు మనం గమనిస్తామని చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు షుగర్‌ లేని ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు.

చక్కెర వాడకం మానేయటం వల్ల రక్తనాళాల్లో ఉండే కొవ్వు తరుగుతూ వస్తుంది. మెదడు మరమ్మతులు చేసుకుంటుంది. చక్కెర వాడకం కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది. మానేయటంతో దృష్టి మెరుగు పడుతుంది. మన శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. రక్తనాళాల వాపులు తగ్గుతాయి. తీపి తినాలనే కోరికలు తగ్గిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి.. బాగా పెరుగుతాయి. ముఖంలో ఉండే కొవ్వు కరిగి.. మనం మరింత అందంగా కనిపిస్తాము.

ఇవి కూడా చదవండి

చక్కెరను తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. మధుమేహం ముప్పు తగ్గుతుంది. చక్కెర లేని ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. చక్కెరతో ఉన్న ఆహారాలు తీసుకుంటే దంతాలకు హానికరం. చక్కెర లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి బయటపడొచ్చు.

కొద్ది రోజుల పాటు చక్కెర తినడం మానేస్తేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావటం మీరు గమనిస్తారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల మీరు ఎక్కువ సమయం పాటు శక్తిని కొల్పోకుండా ఉంటారు.

చక్కెర క్యాన్సర్‌కు దారితీసే ఒత్తిడి, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను పెంచుతుంది. మీ ఆహారంలో చక్కెర తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తీపి కోసం మీరు చక్కెరకు బదులుగా తేనె, బార్లీ సైరప్, లేదా స్టీవియా వంటి చక్కెర-రహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ