కాదని నిరూపిస్తే.. దుబ్బాక చౌరస్తాలో ఉరేసుకుంటా: బండి సంజయ్
తెలంగాణ సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులు లేవన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

Dubbaka By Poll: తెలంగాణ సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులు లేవన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. దుబ్బాక అభివృద్ధికి కేంద్రం రూ. 285 కోట్లు ఇచ్చిందని.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై చర్చకు రావాలంటూ సీఎం కేసీఆర్‌కు ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్ర సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులు లేవని నిరూపిస్తే.,. దుబ్బాక చౌరస్తాలో ఉరి వేసుకుంటానని కేసీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ ఘాటుగా సమాధానమిచ్చారు.
అంతకముందు సీఎం కేసీఆర్ బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృత్తి పెన్షన్ల విషయంలో రాష్ట్రం ఏటా రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 105 కోట్లేనని అన్నారు. మొత్తం కేంద్రమే భరిస్తోందని బీజేపీ నేతలు పెన్షన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవేళ తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బీజేపీ నేతలకు కేసీఆర్ సవాల్ విసిరారు.
