Mallareddy family: ఏంటి మేడమ్ ఈ గ్రేస్.. మల్లారెడ్డి కోడలు చూడండి ఎలా డ్యాన్స్ చేసిందో
మాజీ మంత్రి మల్లారెడ్డి ఎనర్జీ గురించి చెప్పేది ఏముంది. ఆయన నెక్ట్స్ లెవల్ అంతే. అయితే ఆయన కోడలు సైతం ఇప్పుడు అదే ఎనర్జీతో దూసుకుపోతున్నారు. కాలేజ్‌లో కాలా చష్మా పాటకు ప్రీతీ రెడ్డి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రీతిరెడ్డిని మామకు తగ్గ కోడలుగా కామెంట్ చేస్తున్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎనర్జీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటుంది. జనాల అటెన్షన్ గ్రాబ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తనదైన శైలిలో పబ్లిక్‌లో స్టెప్పులెస్తూ ఆయన అభిమానుల్ని, కార్యకర్తల్ని ఉత్సహపరుస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా మామకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి అందరిలోనూ జోష్ నింపింది. కాలేజ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె కాలా చష్మా పాటకు కాలు కదిపింది. చాలా ఈజ్‌తో ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్ నెక్ట్స్ లెవల్ అంతే. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రీతిరెడ్డి మామకు తగ్గ కోడలు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో దిగువన




