Nampally Train Accident: ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పడు రెస్క్యూకి ఉపయోగించే స్పెషల్ ట్రైన్ ఇదే.. ఇందులో ఏమేమి ఉంటాయంటే
చెన్నై నుంచి వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి పెను ప్రమాదం తప్పింది. లాస్ట్ స్టేషన్ నాంపల్లిలో ఆగే సమయంలో ఈ ఘటన జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 5 పై ఆగే సమయంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా వెళ్లి డెడ్ ఎండ్‌లో ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో మూడు భోగిలు పట్టాలు తప్పయి. ప్రమాద తీవ్రత చిన్నదైనప్పటికీ ఈ ఘటనపై రైల్వే శాఖ ఎంక్వయిరీ జరుపుతుంది. నాంపల్లి స్టేషన్లో జరిగిన ప్రమాదానికి..

నాంపల్లి, జనవరి 10: చెన్నై నుంచి వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి పెను ప్రమాదం తప్పింది. లాస్ట్ స్టేషన్ నాంపల్లిలో ఆగే సమయంలో ఈ ఘటన జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 5 పై ఆగే సమయంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా వెళ్లి డెడ్ ఎండ్‌లో ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో మూడు భోగిలు పట్టాలు తప్పయి. ప్రమాద తీవ్రత చిన్నదైనప్పటికీ ఈ ఘటనపై రైల్వే శాఖ ఎంక్వయిరీ జరుపుతుంది. నాంపల్లి స్టేషన్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ చేసేందుకు హెవీ మెటల్ ఎక్విప్మెంట్ తో కూడిన ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగింది. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చిన తర్వాత రెస్క్యు లో వేగం పెంచిన అధికారులు 4గంటలోనే పూర్తిస్థాయిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ని అక్కడి నుంచి క్లియర్ చేశారు. పట్టాలు తప్పిన s2,s3, s6 భోగిలను వేగన్‌కి తరలించి వాటి పరిస్థితిని చెక్ చేస్తున్నారు.
ఎప్పుడు ఎక్కడ రైల్వేలో ప్రమాదం జరిగిన దగ్గర్లో ఉన్నటువంటి డిపో నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ వెహికల్ ప్రమాద తీవ్రతను బట్టి అక్కడికి వెళుతుంది. వెళ్లిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి హెవీ మెటల్ ఎక్విప్మెంట్ తో టెక్నికల్ టీంతో పాటు ఇంజనీరింగ్ టీం, మెకానిక్ టీం అక్కడికి చేరుకుంటుంది. జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒక అంచనా వేస్తుంది. ట్రైన్ పట్టాలు తప్పితే, ట్రాక్ పాడైతే, పూర్తిగా పడిపోయిన ట్రైన్ బోగిలను ఎలా సెపరేట్ చేసి వాటిని అక్కడి నుంచి ఎలా తరలించాలో.. వంటి పూర్తిస్థాయి ఎక్విప్మెంట్‌తోపాటు, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేటువంటి టోటల్ టీం ఈ ట్రైన్‌లో ఉంటారు. ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ప్రమాదం జరగగా.. రెస్క్యూ అధికారులు ఒంటిగంట వరకు ట్రాక్‌పై నుంచి పట్టాలు తప్పిన భోగిలను అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత రెగ్యులర్ ట్రైన్‌లను మూవ్ చేశారు.
జరిగిన ప్రమాదానికి సంబంధించి నాంపల్లి రైల్వే స్టేషన్ గుండా వెళ్లే ఎంఎంటిసి రైళ్లను ట్రాక్ లైన్ క్లియర్ అయ్యేవరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లు కొంతమేర ఆలస్యంగా నడుస్తాయని, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు ఇస్తామని రైల్వే అధికారులు తెలిపారు. తరచూ జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు సంబంధించి రైల్వే అధికారులు కమిటీలకే పరిమితమవుతూ అసలు కారణాన్ని చెప్పట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కమిటీ వేసి నిజాలు చెబుతామని రైల్వే అధికారులు అంటున్నారు. ఎప్పటికీ ఈ అంశంపై స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.