AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: కమలం పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. బండి సంజయ్ కామెంట్స్‌తో రెండు వర్గాలుగా నేతలు..

తెలంగాణ కమలంలో ముసలం రాజుకుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో అసమ్మతి జ్వాలలు ఓ రేంజ్‌లో ఎగిసిపడుతున్నాయి. బండి సంజయ్‌ టార్గెట్‌గా ఒక్కొక్కరు గళం విప్పుతుండటం కమలం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

Telangana BJP: కమలం పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. బండి సంజయ్ కామెంట్స్‌తో రెండు వర్గాలుగా నేతలు..
Telangana Bjp
Shaik Madar Saheb
|

Updated on: Mar 13, 2023 | 8:59 PM

Share

తెలంగాణ కమలంలో ముసలం రాజుకుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో అసమ్మతి జ్వాలలు ఓ రేంజ్‌లో ఎగిసిపడుతున్నాయి. బండి సంజయ్‌ టార్గెట్‌గా ఒక్కొక్కరు గళం విప్పుతుండటం కమలం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. MLC కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యల వివాదం సెంట్రిక్‌గా తెలంగాణ BJPలో పెను దుమారం రేగుతోంది. కవితను అరెస్ట్‌ చేయకపోతే ముద్దుపెట్టుకుంటారా అన్న బండి కామెంట్స్ తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీన్ని ఆయుధంగా మల్చుకొని BRS తెలంగాణవ్యాప్తంగానే కాదు.. ఢిల్లీలోనూ ఆందోళనలు చేసింది. ఈ వివాదం పార్టీకి బాగా డ్యామేజ్‌ చేసిందన్నది కొందరు సీనియర్ల వాదన. పరిస్థితి BJPకి అనుకూలంగా మారుతున్న టైమ్‌లో ఇలాంటి అనవసర వివాదాలు తీవ్ర నష్టం చేస్తున్నాయని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.!బండి సంజయ్ తన లిమిట్స్‌ క్రాస్‌ చేస్తున్నారని ఎంపీ అర్వింద్ పరోక్షంగా ఆరోపించారు.

ఇక అర్వింద్‌కు మద్దతుగా BJP సీనియర్ నేత శేఖర్‌ రావు చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి.! హైకమాండ్‌ పెద్దలకు ఈయన అత్యంత సన్నిహితుడు.. మోదీ, అమిత్‌ షాలకు దగ్గరి వ్యక్తి. అలాంటి శేఖర్‌ రావు నేరుగా బండిని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. శేఖర్‌రావు చేసింది మామూలు ఆరోపణలేం కాదు. బ్లాక్‌మెయిల్‌ చేయడం, ఇష్యూస్‌ లేవదీసి అంతర్గతంగా సెటిల్మెంట్‌లు., సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, యూజ్‌ అండ్ త్రో.. ఇవన్నీ BJP సంస్కృతి కాదు. అయినా యధేచ్చగా నడుస్తున్నాయని.. వీటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు శేఖర్‌ రావు..

అంతర్గత సమావేశంలో మాట్లాడుతా.. విజయశాంతి

ఈ వ్యవహారంపై విజయశాంతి స్పందించారు. బండి సంజయ్ పై అరవింద్ చేసిన వ్యాఖ్యలు గురించి పార్టీ అంతర్గతంగా సమావేశంలో మాట్లాడుతానని తెలిపారు. తమ పార్టీ ఎంపీ అర్వింద్ మాట్లాడిన సందర్భం మొత్తం చూడలేదని.. అందులోని ఏదో ఒక అంశాన్ని బీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. సంజయ్ తన మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. కేసీఆర్, వారి కుటుంబం, చాలామంది బీఆర్ఎస్ నాయకులు వారి గత, ఇప్పటి మాటలను అనేకసార్లు వెనక్కి తీసుకుని, వందల సార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని గుర్తించాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

స్పందించిన రాజాసింగ్..

ఇదిలాఉంటే.. ఈ వివాదంపై బీజేపీ బహిష్కృత MLA రాజాసింగ్ స్పందించారు. అర్వింద్ తీరుని తప్పుపట్టారు. ఏదైనా వివాదం ఉంటే బండి సంజయ్ తో మాట్లాడి తేల్చుకోవాలంటూ సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు.. ఆయనకు ఏం మాట్లాడాలో తెలుసంటూ వ్యాఖ్యానించారు.

నిన్న తెలంగాణకు వచ్చిన అమిత్‌షా పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. విభేదాలను పక్కన పెట్టి నేతలంతా సమన్వయంతో .. ఒక టీమ్‌లాగా పనిచేయాలని స్పష్టం చేశారు.. ఈ టైమ్‌లోనే అర్వింద్, శేఖర్‌రావు లాంటి కీలక నేతలు బండిపై నేరుగా తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us