AECS Hyderabad: హైదరాబాద్-అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో టీచర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్.. ఒప్పంద ప్రాతిపదికన ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచింగ్ (టీజీటీ, పీఆర్‌టీ) పోస్టుల భర్తీకి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్.. ఒప్పంద ప్రాతిపదికన ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచింగ్ (టీజీటీ, పీఆర్‌టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్, సోషల్ సైన్సెస్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీఈటీ, ఆర్ట్, తెలుగు తదితర విభాగాల్లో ఖాళీలను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో సీనియర్/హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల ఏప్రిల్ 1, 2023వ తేదీనాటికి వయసు 40 నుంచి 45 ఏళ్లకు మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 18, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, స్కిల్‌టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,250ల నుంచి రూ.26,250ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The Security Office, Entrance of DAE Colony, D-Sector Gate, Kamalanagar, ECIL Post, Hyderabad-500 062.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.