KV Nizamabad: నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయలో టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఏయే తేదీల్లోనంటే..
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో.. ఒప్పంద ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ కేంద్రీయ విద్యాలయ సంగతన్..
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో.. ఒప్పంద ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ కేంద్రీయ విద్యాలయ సంగతన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, పీఆర్టీ తదితర విభాగాల్లో టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు/సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ఇంటర్, డీఎడ్/డిప్లొమా/బీటెక్/బీఈ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్/హిందీ మీడియంలలో భాషా ప్రావీణ్యంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు 2023, మార్చి 17, 18 తేదీలలో కింది అడ్రస్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్ లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
Kendriya Vidyalaya Nizamabad, DIET College Campus, Near RTO Office, Nizamabad.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.