AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Attack: మళ్లీ అదే ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల్ని చంపిన వీధి కుక్కలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కలు దాడి చేసి ఓ బాలుడిని దారుణంగా చంపిన ఘటన మరువక ముందే మరొక ఘోరం చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు..

Dog Attack: మళ్లీ అదే ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల్ని చంపిన వీధి కుక్కలు
Stray Dogs Kill Two Siblings In Delhi
Srilakshmi C
|

Updated on: Mar 13, 2023 | 4:14 PM

Share

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కలు దాడి చేసి ఓ బాలుడిని దారుణంగా చంపిన ఘటన మరువక ముందే మరొక ఘోరం చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు రెండు రోజుల వ్యవధిలో కుక్కల దాడిలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కుక్కల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న కుక్కల దాడుల దృష్ట్యా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వివరాల్లోకెళ్తే..

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన వసంత్ కుంజ్ ప్రాంతంలో సింధి క్యాంపులో ఆనంద్ (7), ఆదిత్య (5) అనే చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో అన్నదమ్ములిద్దరినీ వీధి కుక్కలు బలిగొన్నాయి. మార్చి 10 న ఆనంద్‌ ఆడుకుంటూ సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ఆడుకోవడానికి వెళ్లిన కొడుకు ఇంకా తిరిగి రాకపోవడంతో తల్లి పోలీసులకు సమాచారం అందించింది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రెండు గంటల తర్వాత ఓ ఖాళీ స్థలంలో శరీరం నిండా గాయాలతో ఉన్న బాలుడి మృత దేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం బాలుడిని ఆసుపత్రికి తరలించి, కుక్కల దాడిలో చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆనంద్‌ తమ్ముడు ఆదిత్యపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయగా తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సనందించినా ఫలితంలేకపోయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో ఒకే కుంటుంబానికి చెందిన అన్నదమ్ములు మరణించడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. వీధి కుక్కల స్వైర విహారం, సర్కార్ నిర్లక్ష్యం.. వెరసి పసిపిల్లల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.