AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Tourists: గోవాలో దారుణం, టూరిస్టు కుటుంబంపై కత్తులతో దాడి చేసిన దుండగలు

గోవాలో దారుణం, టూరిస్టు కుటుంబంపై కత్తులతో దాడి చేసిన దుండగలు

Goa Tourists: గోవాలో దారుణం, టూరిస్టు కుటుంబంపై కత్తులతో దాడి చేసిన దుండగలు
Injured Tourists
Aravind B
|

Updated on: Mar 13, 2023 | 4:24 PM

Share

గోవా అంటే అందరికీ గుర్తుకువచ్చేది అక్కడ ఉండే బీచ్, రిసార్ట్స్. ఎంతోమంది టూరిస్టులు అక్కడికి ఆనందంగా గడిపేందుకు వస్తుంటారు. కానీ కొన్ని సంఘటనలు చూస్తే ఇలాంటివి కూడా జరుగుతాయా అనే ఆలోచనలకు దారితీస్తున్నాయి. తాజాగా గోవా చూసేందుకు వచ్చిన ఓ టూరిస్టు కుటుంబాన్ని కొంత మంది దుండగులు ఆయుధాలు, కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.

ఏం జరిగిందంటే.. జతిన్ శర్మ తన కుటుంబంతో కలిసి గోవా చూసేందుకు వచ్చారు. అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్టుకి వారు వెళ్లారు. అక్కడ ఉన్న హోటల్ సిబ్బందితో వాళ్లకి చిన్న వాగ్వాదం జరుగగా, ఈ విషయంపై హోటల్ మెనేజర్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన మేనేజర్ సిబ్బందిని మందలించారు. దీంతో ఆ హోటల్ సిబ్బంది కోపంతో తమ స్నేహితులకు ఫోన్ చేసి రప్పించి జతిన్ శర్మ కుటుంబ సభ్యులను హోటల్ బయట విచక్షణా రహితంగా కొట్టారు. కత్తులతో దాడి చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముగ్గరిని అరెస్టు చేశారు. తమ కుటుంబంపై దాడి చేసిన దృశ్యాలను జతిన్ శర్మ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాదు గోవాలోని అంజునాలో ఉన్న స్పాజియో లీజర్ రిసార్టుకి ఎవరూ రావద్దని కూడా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా స్పందించారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించానని ట్విటర్ లో తెలిపారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..