Dengue: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డెంగ్యూ అటాక్.. తెలంగాణలో విపత్కర పరిస్థితులు

డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తెలంగాణ మొత్తాన్ని వణికిస్తోంది. రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. డెంగ్యూ...

Dengue: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డెంగ్యూ అటాక్.. తెలంగాణలో విపత్కర పరిస్థితులు
Dengue
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 06, 2021 | 2:52 PM

డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తెలంగాణ మొత్తాన్ని వణికిస్తోంది. రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. డెంగ్యూ బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అసలే కరోనా కల్లోలంతో వణికిపోతున్న జనానికి డెంగ్యూ కునుకులేకుండా చేస్తోంది.  ఓ వైపు కరోనా మరోవైపు వర్షాలు.. వీటికి తోడు సీజనల్ వ్యాధులు కంగారెత్తిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. వాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్లేట్ లెట్స్‌ తగ్గిపోయి ముప్పు ముంచేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డెంగ్యూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో పాటు డెంగ్యూ జ్వరాలు జిల్లావాసుల్ని హడలెత్తిస్తున్నాయి. వర్షాలు, వరద కారణంగా దోమల విజృంభణ పెరిగి చాలామంది విషజ్వరాల బారిన పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో కేవలం 15 రోజుల వ్యవధిలో 50కి పైగా కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దిలావర్‌పూర్‌, భైంసా, ఖానాపూర్‌లో డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. కళ్లు తిరగడం, తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధితులు ఇబ్బందిపడుతున్నారు.

కేసుల పెరుగుదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం

నిజామాబాద్‌ జిల్లాపై డెంగ్యూ, చికెన్ గున్యాతో పాటు విష జ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. ఆస్పత్రిలో చేరే రోగులందరికి డెంగ్యూ సోకిందని చెప్పలేమంటున్నారు డాక్టర్లు. లక్షణాలు ఉంటే మాత్రం ఆస్పత్రికి వెళ్లాలని సజెస్ట్ చేస్తున్నారు. వర్షాలు పడుతున్న వేళ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్య ఆరోగ్య శాఖాధికారులు. ముఖ్యంగా మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలంటున్నారు. ఏమాత్రం సింటమ్స్ కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలంటున్నారు.

Also Read: మంత్రాలయంలో వింత ఘటన.. ఆవు దూడకు కడుపు నిండా పాలు ఇచ్చిన సునకం..

బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ ఐదు ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి.. ప్రయోజనాలు తెలుసుకోండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..