AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Warning: తెలంగాణలో వ్యాధులు ప్రబలుతున్నాయి.. జాగ్రత్త.! : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణలో డెంగ్యూతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చిన్నా,పెద్దా అంతా అప్రమత్తంగా ఉండాలని..

Health Warning: తెలంగాణలో వ్యాధులు ప్రబలుతున్నాయి.. జాగ్రత్త.! : తెలంగాణ హెల్త్ డైరెక్టర్
Telangana Public Health Director G Srinivasa Rao
Venkata Narayana
|

Updated on: Aug 06, 2021 | 2:03 PM

Share

Telangana Health Director: తెలంగాణలో డెంగ్యూతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చిన్నా,పెద్దా అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. గతంతో పోల్చుకుంటే డెంగ్యూ, మలేరియా కేసులు రాష్ట్రంలో తక్కువగా నమోదు అవుతున్నాయని అయన అన్నారు. అంతేకాక, సదరు వ్యాధుల వల్లే సంభవించే మరణాల రేటు కూడా చాలా తగ్గిపోయిందని ఇవాళ టీవీ9తో మాట్లాడుతూ వెల్లడించారు.

వర్షాలు పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. తాగు నీరు, ఆహారం కలుషితం వల్ల సీజనల్ వ్యాధులు వస్తుంటాయన్నారు. “గత మూడు సంవత్సరాలుగా డెంగ్యూ మరణాలు జరగలేదు. హెల్త్, మున్సిపల్, పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్లతో ప్రజల్లో ఇలాంటి టైం లో ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అనేదానిపై అవగాహన కల్పిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు .

అన్ని శాఖల సమన్వయంతో ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. మూడు నెలల నుండి గ్రామీణ, పట్టణ ప్రాతాల్లోని వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమలు వృద్ది చెందకుండా జాగ్రతలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్ మస్కిటో నెట్స్, రాపిడ్ డయగ్నస్టిక్ టెస్ట్ కిట్ లను అందుబాటులో ఉంచుతున్నామని హెల్త్ డైరెక్టర్ చెప్పారు.

Read also: Somu Veerraju: ‘అలా ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదు..’ అయోమయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.!