Somu Veerraju: ‘అలా ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదు..’ అయోమయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వనమహోత్సవం జరుగుతోన్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీయేటా వనమహోత్సవం పేరుతో
Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వనమహోత్సవం జరుగుతోన్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీయేటా వనమహోత్సవం పేరుతో నాటుతోన్న 5 కోట్ల మొక్కలు పెరిగితే ఆంధ్రప్రదేశ్ అడవిగా మారిపోవాలని, అలా ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదన్నారు.
వనమహోత్సవాన్ని డబ్బులు దండుకునే కార్యక్రమంగా మార్చేశారని, టీడీపీ కూడా నీరు చెట్టు పేరుతో ఇదే ప్రాక్టీస్ చేసిందన్నారు సోము వీర్రాజు. రాష్ట్రంలో అమలుచేసే ప్రతీ పథకంలో అగ్రభాగం కేంద్ర నిధులే అని చెప్పిన సోము, అడ్డమైన అప్పులు చేస్తూ కేంద్రం చేయలేదా..? అని ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తున్నారని సోము విమర్శించారు.
కేంద్రం అభివృద్ధికి చేస్తే రాష్ట్రం చేస్తోందేంటి? అని ప్రశ్నించిన సోము.. పప్పులు, బెల్లాలు పంచడం కదా అంటూ సెటైర్లు వేశారు. మూడురోజులపాటు ఢిల్లీలో పలు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర ప్రాజెక్ట్స్ పై చర్చించామని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. అమరరాజా విషయంలో ప్రభుత్వం అభివృద్ధితో కూడిన రాజకీయాలు చేయాలే కానీ.. విద్వేష రాజకీయాలు రాష్ట్రానికి మంచి చేయవన్నారు సోము.