AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: మంత్రాలయంలో వింత ఘటన.. ఆవు దూడకు కడుపు నిండా పాలు ఇచ్చిన సునకం..

Kurnool: అమ్మతనం ఎంతో గొప్పది. ప్రతి జీవి అమ్మ ప్రేమకు దాసోహామే. అమ్మకు తన మన అనే పర భేదము లేదు. సాధారణంగా ఎవరైనా చింటి..

Kurnool: మంత్రాలయంలో వింత ఘటన.. ఆవు దూడకు కడుపు నిండా పాలు ఇచ్చిన సునకం..
Dog And Calf
Shiva Prajapati
|

Updated on: Aug 06, 2021 | 1:42 PM

Share

Kurnool: అమ్మతనం ఎంతో గొప్పది. ప్రతి జీవి అమ్మ ప్రేమకు దాసోహామే. అమ్మకు తన మన అనే పర భేదము లేదు. సాధారణంగా ఎవరైనా చంటి బిడ్డ ఆకలితో ఏడిస్తే.. ఆ బిడ్డ తన బిడ్డ కాకపోయినా కొందరు తల్లులు పాలు పట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక సంఘటనలో చెత్త కుప్పలో పడేసిన చిన్నారిని పోలీసులు గుర్తించగా.. ఆ చిన్నారి ఏడుపుకు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ పాలు పట్టించింది. ఆ చర్యతో సదరు మహిళా కానిస్టేబుల్ దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంది. వాస్తవాకి ప్రతీ మాతృమూర్తి స్వభావం ఇలాగే ఉంటుంది. అయితే, ఈ స్వభావం ఒక్క మనుషులకే అనుకుంటే పొరబడినట్లే. జంతువులలో మాతృమూర్తి ప్రేమ అలాగే ఉంటుంది. స్వజాతి అయినా.. వేరే జాతి అయినా.. మాతృత్వం విషయంలోకి వచ్చే సరికి అంతా ఒక్కటే అన్న భావన కలుగుతుంది.

ఇదంతా ఎందుకంటే.. మంత్రాలయం ప్రధాని వీధిలో గురువారం రాత్రి ఓ శునకం పడుకున్న లేగ దూడకు పాలు ఇచ్చింది. ఆ లేగ దూడ పాలు తాగినంతసేపు.. శునకం అలాగే కదలకుండా నిల్చుంది. శునకం.. ఆ ఆవు దూకు పాలు పట్టించిన దృశ్యం చూసి భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. మాతృత్వాన్ని మించింది ఈ భూమిపై మరోటి లేదని ఈ శునకం మరోసారి నిరూపించిందని అనుకున్నారు. కాగా, శునకం, ఆవు దూడకు పాలు ఇస్తుండగా.. కొందరు భక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణ బస్టాండ్‌ ఆవరణలో చోటు చేసుకుంది. హాయిగా పడుకుని సేదతీరున్న ఆవు వద్దకు వచ్చిన కొన్ని పంది పిల్లలు.. ఆవు పాలు తాగాయి. ఆవు పొదుగు చుట్టూ చేరిన పందిపిల్లలు పాలు తాగాయి. అవి పాలు తాగినంత సేపు ఆ ఆవు కూడా ఏమీ అనకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

Also read:

Chennai: చెన్నైలో దారుణం.. కూల్ డ్రింక్ తాగిన క్షణాల్లోనే నీలం రంగులోకి మారిన శరీరం.. ఆ తరువాత..

Prakasham: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సిద్ధపడ్డ ఆర్మీ ఉద్యోగి.. విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే..

Viral Video: అమ్మాయిలా మజాకా.. ఆ స్టైల్ ఏంటీ.. ఆ బైక్ తోలుడేంది.. దుమ్ము లేపారంతే…

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు