AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం.. ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..

Andhra Pradesh: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఓ ఆటో డ్రైవర్.. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇచ్చిన బాకీని చెల్లించమని..

Andhra Pradesh: మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం.. ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..
Auto Driver
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 06, 2021 | 7:31 PM

Share

Andhra Pradesh: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఓ ఆటో డ్రైవర్.. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇచ్చిన బాకీని చెల్లించమని అడిగినందుకు.. కాలితో ఎగిరి తన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో నివాసం ఉంటోంది. అయితే, మహానాడులో ఉండగా తాపీ మేస్త్రీగా పని చేసే చిర్రావురికి చెందిన గోపీ కృష్ణ అనే యువకుడికి రూ. 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించింది. అప్పటి నుంచి అప్పు తీర్చమని అడుగుతున్నా.. గోపీ కృష్ణ పట్టించుకోవడం లేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న మహిళ.. చిర్రావురుకు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని గోపీ కృష్ణను అడిగింది.

అయితే, గోపీ కృష్ణ.. ఆ మహిళను తన ఆటోలో జనంసచారం లేని కృష్ణ కరకట్ట వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ డబ్బుల గురించి అడగ్గా.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కృష్ణ.. కాలితో ఎగిరి తన్నటంతో.. మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ వ్యవహారాన్నంతా మహిళతో వచ్చిన మరొకరు వీడియో తీశారు. కాగా, కృష్ణ తీరుపై 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను చికిత్స నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటన చిర్రావూరు, రామచంద్రపురం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Prakasham: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సిద్ధపడ్డ ఆర్మీ ఉద్యోగి.. విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే..

Viral Video: అమ్మాయిలా మజాకా.. ఆ స్టైల్ ఏంటీ.. ఆ బైక్ తోలుడేంది.. దుమ్ము లేపారంతే…

Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్.. పూర్తి వివరాలు మీకోసం..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు