Prakasham: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సిద్ధపడ్డ ఆర్మీ ఉద్యోగి.. విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే..

Prakasam: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు ఓ ఆర్మీ ఉద్యోగి. సమాచారం తెలుసుకున్న హిజ్రా స్నేహితులు..

Prakasham: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సిద్ధపడ్డ ఆర్మీ ఉద్యోగి.. విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే..
Army
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 06, 2021 | 12:53 PM

Prakasam: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు ఓ ఆర్మీ ఉద్యోగి. సమాచారం తెలుసుకున్న హిజ్రా స్నేహితులు.. వివాహ వేడుక వద్దకు చేరకుని పెళ్లిని నిలిపివేశారు. జరిగిన విషయాన్ని యువతి బంధువులకు తెలియజేశారు. దాంతో యువతి పెళ్లి పీఠలపై నుంచి వెళ్లిపోయింది. తనను నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించిన ఆర్మీ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గిద్దలూరుకు చెందిన మగ్బూల్, వినీత్(పేరు మార్చాం) ఇద్దరూ మంచి స్నేహితులు.. చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగారు.. ఆర్మీలో చేరేందుకు ఇద్దరూ కలిసే దరఖాస్తు చేసుకున్నారు.. ఒకరికి ఉద్యోగం వచ్చింది, మరొకరికి రాలేదు. అయితే, ఇక్కడే ఊహించని ట్విస్ట్ మొదలైంది. ఉద్యోగం వచ్చిన యువకుడు మగ్బుల్ హాయిగా ఆర్మీలో చేరి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఉద్యోగం రాని యువకుడు వినీత్.. ఇంటికి వచ్చి కొంతకాలం తరువాత హిజ్రాగా మరాడు. తన పేరును వినీత గా మార్చుకున్నాడు. అయితే, సెలవులపై ఇంటికి వచ్చిన మగ్బుల్‌ను.. హిజ్రాగా మారిన వినీత్(పేరు మార్చాం) కలిశాడు. హిజ్రాగా మారిన తన స్నేహితుడిని చూసి మగ్బుల్ మొదట షాక్ అయ్యాడు. ఆ తరువాత యధావిగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్నారు. కొంతకాలం పాటు సహజీనం చేశారు.

తాజాగా ఆర్మీ ఉద్యోగి మగ్బుల్ తల్లిదండ్రులు అతనికి ఓ యువతితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. గురువారం పెళ్లికి జరగాల్సి ఉండగా.. హిజ్రా స్నేహితులు రంగంలోకి దిగి పెళ్లి అడ్డుకున్నారు. మగ్బుల్ తన స్నేహితురాలితో సహజీవనం చేస్తున్నాడని ఈ పెళ్లి ఆపవలసిందిగా కోరారు. దీంతో వివాదం చెలరేగింది… ఈ పరిణామంతో బిత్తరపోయిన పెళ్లి కుమార్తె బంధువులు పెళ్ళి తంతు ఆపేసి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్థాపానికి గురైన హిజ్రాగా మారిన వినీత పురుగు మందు తాగడంతో నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మగ్బుల్ బంధువులు తమను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూశారని పెళ్లికూతురు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read:

Viral Video: అమ్మాయిలా మజాకా.. ఆ స్టైల్ ఏంటీ.. ఆ బైక్ తోలుడేంది.. దుమ్ము లేపారంతే…

Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్.. పూర్తి వివరాలు మీకోసం..

Viral Video: క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి.. మరో వీడియో వైరల్.. చూస్తే షాక్ అవుతారు..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్