AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి.. మరో వీడియో వైరల్.. చూస్తే షాక్ అవుతారు..

Viral Video: క్యాబ్ డ్రైవర్‌ని కొట్టి ఓవర్ నైట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన లక్నో యువతి ప్రియదర్శిని యాదవ్‌కు సంబంధించిన మరో షాకింగ్ వీడియో వైరల్

Viral Video: క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి.. మరో వీడియో వైరల్.. చూస్తే షాక్ అవుతారు..
Lucknow Girl
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 06, 2021 | 10:33 AM

Share

Viral Video:  నడి రోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని కొట్టి వార్తల్లో నిలిచిన లక్నో యువతి ప్రియదర్శిని యాదవ్‌కు సంబంధించిన మరో షాకింగ్ వీడియో వైరల్ ‌అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఒక అమ్మాయి క్యాబ్ డ్రైవర్‌‌ను కొట్టిన వీడియో గత రెండ్రోజులుగా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది కూడా.. క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన లక్నో యువతిని అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు డిమాండ్ చేయగా..మరికొందరు ఆమెను సమర్థించారు. క్యాబ్ డ్రైవర్‌పై చేయిచేరుకున్నందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. అయితే తన చర్యను సమర్థించుకున్న లక్నో యువతి.. క్యాబ్ డ్రైవర్‌కు క్షమాపణ చెప్పేది లేదని స్పష్టంచేశారు. పోలీసుల తీరు కూడా సరిగ్గా ఉండటం లేదంటూ మండిపడ్డారు. అటు తనపై చేయిచేసుకున్న యువతిని అరెస్టు చేయాలని  క్యాబ్ డ్రైవర్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రియదర్శిని యాదవ్‌కు చెందిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రయదర్శిని తన పొరుగింటి వారితో ఘర్షణకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, అలా ఘర్షణకు దిగడానికి గల కారణమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. పొరుగింటి వారు తమ గేట్‌కు బ్లాక్ కరల్ రంగు వేసుకోవడం ప్రియదర్శికి నచ్చలేదు. దాంతో నేరుగా వారి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది. ఆ రంగును మార్చాలంటూ డిమాండ్ చేసింది. వీరి కారణంగా కాలనీ మొత్తం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందంటూ ఆ యువతి గట్టి గట్టిగా అరిచింది. ప్రియదర్శిని చర్యతో కాలనీ వాసులంతా అక్కడికి వచ్చి చేశారు. నల్ల రంగు కారణంగా కాలనీ వాసులకు ప్రమాదం ఉందని, డ్రోన్స్ ద్వారా దాడి జరుగుతుందంటూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడింది.

కాగా, యువతి రచ్చ ఎక్కువ అవడంతో.. పోలీసులు ఎంటర్ అయ్యారు. ఘటనా స్థలికి పోలీసులు రాగా.. వారితోనూ వాగ్వాదానికి దిగింది. గేట్ రంగు మార్చమని వారికి చెప్పండంటూ పోలీసులకు చెప్పింది. అయితే, యువతికి నచ్చజెప్పేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటు యువతిని, అటు పొరుగింటి వారికి సర్దిచెప్పి ఎవరింటికి వారిని పంపించేశారు. ఇదిలాఉంటే.. ప్రియదర్శిని యాదవ్ రచ్చను కొందరు వీడియో తీశారు. తాజాగా క్యాబ్ డ్రైవర్‌ని కొట్టిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పాత వీడియోను మళ్లీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. యువతి మెదడు దెబ్బతిన్నదని, చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Viral Video:

Also read:

MU Admissions 2021: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముంబై యూనివర్సిటీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

Viral Video: పీత తలపై గుడ్డు పగలగొట్టాడు.. వీడియో వైరల్.. ఊహించని రీతిలో నెటిజన్ల రియాక్షన్..

Andhra Pradesh: సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు పురగోతి.. కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే