MU Admissions 2021: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముంబై యూనివర్సిటీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
MU Admissions 2021: యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ముంబై యునివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీలో
MU Admissions 2021: యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ముంబై యునివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోరకునే విద్యార్థులు ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యూయేట్ కోర్సు ప్రవేశానికి సంబంధించి మరింత సమాచారం కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ అయిన mu.ac.in లో చెక్ చేసుకోవచ్చునని తెలిపారు.
కాగా, మహారాష్ట్ర హైయ్యర్ సెకండరీ ఎడ్యూకేషన్ ఫలితాలు ఆగస్టు 3వ తేదీన ప్రకటించారు. ఎంయూలో మొదటి సంవత్సరం యూజీ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించడం లేదని, హెచ్ఎస్‌సి పరీక్షలో విద్యార్థులు పొందిన ఫలితాల ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఎంయూ అడ్మిషన్స్ 2021 ప్రక్రియను పూర్తి చేయడానికి విద్యార్థులు దరఖాస్తు ఫారమ్ నింపాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రీ అడ్మిషన్ ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను తమకు నచ్చిన కాలేజీకి సమర్పించాల్సి ఉంటుందని ఎంయూ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఎంయూలో అడ్మిషన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. 1. ముంబై విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2. హోమ్‌పేజీలో ఉన్న ‘అడ్మిషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. ‘ముంబై యూనివర్సిటీ ప్రీ అడ్మిషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 2021-22’ లింక్‌పై క్లిక్ చేయండి. 4. ఆ తరువాత రిజిస్టర్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలి. 5. నమోదిత వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత అవసరమైన వివరాలు, పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత ఫీజు చెల్లించాలి. 6. అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేసి.. భవిష్యత్ అవసరాల కోసం ఆ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ముంబై యూనివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. BA, BAF, B.Com, B.Sc, BFM, BMM, ఇతర కోర్సుల కోసం మొదటి మెరిట్ జాబితా ఆగస్టు 17, 2021 న విడుదల చేయనున్నారు. మరోవైపు, ఎంయూ అడ్మిషన్స్ కోసం రెండవ మెరిట్ జాబితా ఆగస్టు 25వ తేదీన సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. మూడవ మెరిట్ జాబితా ఆగస్టు 30వ తేదీన వెలువనుంది. ఎంయూ అడ్మిషన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు, అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also read:
Viral Video: పీత తలపై గుడ్డు పగలగొట్టాడు.. వీడియో వైరల్.. ఊహించని రీతిలో నెటిజన్ల రియాక్షన్..
Kochi Teen: వ్యాయాయం చేస్తూ 10 అంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..