RITES Recruitment: రైట్స్ లిమిటెడ్‌లో ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హులెవరు? ఎలా అప్లై చేసుకోవాలంటే..
RITES Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైట్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గురుగావ్‌లోని ఈ సంస్థలో...
RITES Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైట్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గురుగావ్‌లోని ఈ సంస్థలో పలు ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 48 పోస్టులను భర్తీచేయనున్నారు. * 48 ఖాళీలకు గాను సివిల్ (25), మెకానికల్ (15), ఎలక్ట్రికల్ (08) ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు రెండేళ్ల పని అనుభం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఇందులో భాగంగా అనుభవానికి 5 శాతం, రాత పరీక్షకి 60 శాతం, ఇంటర్వ్యూకి 35 శాతం వెయిటేజి కేటాయించారు. * ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 25-08-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: IDBI Recruitment: ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Guava : ఈ 3 వ్యాధులు ఉన్నవారు జామపండు అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..
Viral video: ఇంటికి గెస్ట్‌గా వచ్చిన మొసలి.. పలకరిద్దామని చూస్తే ఇంటిపైకెక్కి కూర్చున్నారు..