Viral video: ఇంటికి గెస్ట్‌‌‌గా వచ్చిన మొసలి.. పలకరిద్దామని చూస్తే ఇంటిపైకెక్కి కూర్చున్నారు..

ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం..? వారిని పలకరించి.. వచ్చిన వారికి సపర్యలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ గెస్ట్ ఇంటికొస్తే ఇంట్లో ఉన్నవాలందరు

Viral video: ఇంటికి గెస్ట్‌‌‌గా వచ్చిన మొసలి.. పలకరిద్దామని చూస్తే ఇంటిపైకెక్కి కూర్చున్నారు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2021 | 8:58 PM

Viral video: ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం..? వారిని పలకరించి.. వచ్చిన వారికి సపర్యలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ గెస్ట్ ఇంటికొస్తే ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఇంటి పైకప్పు ఎక్కి కూర్చున్నారు. భయంతో గడగడలాడిపోయారు. అందేంటీ అనుకుంటున్నారా.. మరి ఇంటికి గెస్ట్‌‌‌‌గా వచ్చింది మనిషి కాదు ఓ ముసలి. ఎక్కడినుంచి వచ్చిందో ఏమో గాని ఓ మొసలి ఏకంగా జనావాసంలోకి వచ్చేసింది. అలా తిరుగుతూ.. తిరుగుతూ ఒకరి ఇంటికి వచ్చి ఎంచక్కా అక్కడక్కడే తిరుగుతూ హల్ చల్ చేసింది. మొసలిని గమనించిన ఆ ఇంటిలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం చేయాలో తెలియక ఇంటిల్లిపాది ఇంటిపైకి ఎక్కి కూర్చున్నారు.  ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. జనాలు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇంటి చుట్టూ తిరిగింది ఆ మొసలి. ఆ తర్వాత అక్కడివారు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ మొసలిని తాళ్లసహయంతో పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే  మొసలి అధికారులకు ముప్పు తిప్పలు పెట్టింది. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. కాగా, దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చివరకు మొసలిని బంధించారు.

దాంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మొసలిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకున్నారు. ఆ మొసలిని ఫోటోలు, వీడియోలు తీస్తూ హంగామా చేశారు. జనాన్ని ఆ మొసలి కూడా బెదిరిపోయింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ ముసలి జనావాసంలోకి వచ్చి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Big Boss 5: బిగ్‌బాస్‌ 5 మరో అప్‌డేట్.. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకోనుంది ఆ యూట్యూబ్‌ స్టారేనా?

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదు.. వీరందరూ ఫిక్స్ అట !

Anasuya Bharadwaj : డిఫరెంట్ గెటప్‌‌‌లో బుల్లితెర బ్యూటీ.. ‘పుష్ప’ షూటింగ్ నుంచి లీకైన అనసూయ లుక్..