Anasuya Bharadwaj : డిఫరెంట్ గెటప్‌‌‌లో బుల్లితెర బ్యూటీ.. ‘పుష్ప’ షూటింగ్ నుంచి లీకైన అనసూయ లుక్..

బుల్లితెర బ్యూటీ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు టీవీ షోలతో మరోవైపు సినిమాలతో దూసుకుపోతోంది

Anasuya Bharadwaj : డిఫరెంట్ గెటప్‌‌‌లో బుల్లితెర బ్యూటీ.. 'పుష్ప' షూటింగ్ నుంచి లీకైన అనసూయ లుక్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2021 | 7:55 PM

Anasuya Bharadwaj : బుల్లితెర బ్యూటీ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు టీవీ షోలతో మరోవైపు సినిమాలతో దూసుకుపోతోంది ఈ అందాల యాంకరమ్మ. టీవీలో సక్సస్ అయిన అనసూయ.. సినిమాల్లోనూ రాణిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గానే కాకుండా  లేడీ విలన్‌‌‌గానూ మెప్పిస్తుంది. అడవి శేష్ నటించిన ‘క్షణం’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పలుసినిమాల్లో యాక్ట్ చేసింది. ‘ఎఫ్ 2’, ‘సోగ్గాడే చిన్నినాయనా’,’రంగస్థలం’, ‘మీకుమాత్రమే చెప్తా’, ‘థాంక్ యు బ్రదర్’ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది అనసూయ. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా అనసూయ కెరీర్‌‌‌‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. రంగమ్మత్త క్యారెక్టర్‌‌లో అనసూయ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోందని తెలుస్తుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుందని మొదటి నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి అనసూయ లుక్ లీక్ అయ్యింది.

సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌‌గా కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి అనసూయకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫొటోలో అనసూయ చాలా డిఫరెంట్‌‌‌గా కనిపిస్తున్నారు. షార్ట్ హెయిర్‌‌తో.. నుదిటిన పెద్ద బొట్టుతో కనిపిస్తుంది అనసూయ. ఈ సినిమాలో సునీల్ భార్యగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట ఈ ముద్దుగుమ్మ. ఇపుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Anasuya

మరిన్ని ఇక్కడ చదవండి : Suriya’s ‘Jai Bhim’: మరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిన సూర్య.. త్వరలోనే స్ట్రీమింగ్

Orey Bamardhi: అసలీ బావ, బామ్మర్దిల మధ్య గొడవేంటి.? ఆసక్తికరంగా ఒరేయ్‌ బామ్మర్ది సినిమా ట్రైలర్‌..

‘బందిపోటు’ సినిమాకు 33 ఏళ్లు.. ఆ సినిమాతోనే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టానన్న సుమన్

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్