Orey Bamardhi: అసలీ బావ, బామ్మర్దిల మధ్య గొడవేంటి.? ఆసక్తికరంగా ఒరేయ్‌ బామ్మర్ది సినిమా ట్రైలర్‌..

Orey Bamardhi: హీరో సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఒరేయ్‌ బామ్మర్ది. బిచ్చగాడు చిత్రాన్ని నిర్మించిన శశి ఈ సినిమాను రూపొందించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు...

Orey Bamardhi: అసలీ బావ, బామ్మర్దిల మధ్య గొడవేంటి.? ఆసక్తికరంగా ఒరేయ్‌ బామ్మర్ది సినిమా ట్రైలర్‌..
Orey Bammardi Trailer
Follow us

|

Updated on: Aug 05, 2021 | 6:42 PM

Orey Bamardhi: హీరో సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఒరేయ్‌ బామ్మర్ది. బిచ్చగాడు చిత్రాన్ని నిర్మించిన శశి ఈ సినిమాను రూపొందించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. గత కొన్ని రోజులుగా సరైన హిట్‌ లేక సతమవుతోన్న సిద్ధార్థ్‌ ఈ సినిమాతో మరోసారి ట్రాక్‌లోకి ఎక్కేట్లు కనిపిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లు ప్రకటించింది.

తాజాగా కరోనా నిబంధనలు సడలించడంతో సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 13న థియేటర్లలో సందడి చేయడానికి ఈ సినిమా సిద్ధమైంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో పబ్లిసిటీపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్‌ను గమనిస్తే వీరిద్దరూ బావ, బామ్మర్దులుగా నటించనున్నట్లు అర్థమవుతోంది. వీరి మధ్య ఏర్పడిన గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందన్న కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్‌లో భాగంగా సిద్ధార్థ్‌ చెప్పే కొన్ని డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా సిద్ధార్థ్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే సిద్ధార్థ్‌ చాలా రోజుల తర్వాత తెలుగు స్ట్రెయిట్‌ మూవీలో నటిస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహా సముద్రంలో శర్వానంద్‌తో పాటు సిద్ధార్థ్‌ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Palm Oil: పామాయిల్ పంటలతో చాలా లాభం ఉంటుంది.. కాళేశ్వరంతో వరంగల్ ప్రాంతం సస్యశ్యామలమైంది : ఎర్రబెల్లి

Drugs: 1 కాదు, 2 కాదు.. ఏకంగా రూ.686 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు

Telangana: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే