AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే

తెలంగాణ మద్యం అమ్మకాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయి. మందుబాబులు అదేదో ఉద్యమం మాదిరి లిక్కర్ సేవిస్తున్నట్లు తాజా గణాంకాలు..

Telangana: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే
Liquor sales at record levels in Telangana
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2021 | 6:20 PM

Share

తెలంగాణ మద్యం అమ్మకాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయి. మందుబాబులు అదేదో ఉద్యమం మాదిరి లిక్కర్ సేవిస్తున్నట్లు తాజా గణాంకాలు చూస్తే తెలుస్తోంది. కరోనా కష్టకాలంలో సర్కార్ ఖజానాకు మందుబాబులు మంచి హెల్పే చేస్తున్నారు. ఒక్క జులై నెలలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. జులై నెలలో రూ.2,767.73 కోట్ల విలువైన 34 లక్షల కేసుల లిక్కర్‌, 27.16 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో లిక్కర్ సేల్స్ జరగడం ఇదే మొదటిసారిగా అని తెలుస్తోంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.643 కోట్ల విలువైన మద్యం, అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో రూ.63 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది.

ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన మద్యం అమ్మకాల విషయానికి వస్తే… హైదరాబాద్‌ రూ.308 కోట్లు, నల్గొండ రూ. 288.91 కోట్లు, నిజామాబాద్‌ రూ.134.92 కోట్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.142.87 కోట్లు, కరీంనగర్‌ రూ.196 కోట్లు, మహబూబ్‌నగర్‌ రూ.196.73 కోట్లు, మెదక్‌ రూ.212.17 కోట్లు, వరంగల్‌ రూ.230.53 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. మద్యం అమ్మకాల్లో… ఉత్పత్తి, విక్రయదారులకు కలిపి 40 శాతం పోగా మిగిలిన 60 శాతం వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ కింద స్టేట్ గవర్నమెంట్ ఖజానాకు చేరుతుంది. జులై నెలలో జరిగిన మద్యం విక్రయాలపై ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్న లెక్కల సారాంశం.

తెలంగాణలో బీరు బాటిల్‌పై పది రూపాయలు తగ్గిస్తూ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విక్రయాలు భారీగా పడిపోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత బీర్ సేల్స్ మంచి జోష్ అందుకున్నాయి. అందుకు తాజాగా వెలువడిన గణాంకాలు ఉదాహారణగా చెప్పొచ్చు. గతంలో బీరు సీసాపై స్పెషల్ ఎక్సైజ్‌ సెస్‌ పేరుతో 30 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించింది.

Also Read:  న్యూసెన్స్ వ్యవహారంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య.. పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు

దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!