Chaitanya Jonnalagadda: న్యూసెన్స్ వ్యవహారంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య.. పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు

మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. బుధవారం(అగస్టు 4) అర్ధరాత్రి చైతన్య...

Chaitanya Jonnalagadda: న్యూసెన్స్ వ్యవహారంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య.. పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు
Chaitanya Jonnalagadda
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2021 | 4:37 PM

మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. బుధవారం(అగస్టు 4) అర్ధరాత్రి చైతన్య న్యూసెన్స్ చేశాడని ఆరోపిస్తూ అపార్ట్‌మెంట్ వాసులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే చైతన్య కూడా అపార్ట్‌మెంట్ వాసులపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అంతకుముందు,అపార్ట్‌మెంట్ వాసులకు-చైతన్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కారణాలేంటో తెలియదు గానీ పెద్ద గొడవే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఈ ఇష్యూపై చైతన్య స్పందించారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల అపార్ట్‌మెంట్ వాసులకు తమకు ఇష్యూ జరిగిందని తెలిపాడు.  పెద్ద సంఖ్యలో తన అపార్ట్ మెంట్ కి కొంతమంది రావడం వల్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. తనపై  ఎటువంటి కేసు నమోదు కాలేదని వెల్లడించాడు.  25 మంది కలిసి తన ఆఫీసులోకి పర్మిషన్ లేకుండా రావడంపై తాను ఫిర్యాదు చేశానని.. ఇరు వర్గాలను పిలిచి పోలీసులు మాట్లాడినట్లు చైతన్య పేర్కొన్నాడు. అపార్ట్‌మెంట్ వాసులు తనకు సారీ చెప్పారని.. తాను వారిపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు వెల్లడించాడు.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు, గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు గతేడాది డిసెంబర్ 9న వివాహం జరిగిన విసయం తెలిసిందే. రాజస్థాన్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా కుటుంబంతో పాటు సన్నిహితులు, అతికొద్ది మంది అతిథులు పాల్గొన్నారు. పెళ్లికి ముందు నిహారిక టీవీ హోస్ట్‌గా చేయడంతో పాటు పలు సినిమాల్లో నటించింది.  అయితే కెరీర్ ఆశించినంత స్థాయిలో ముందుకు సాగలేదు. నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది కానీ సినిమాలు మాత్రం హిట్ కాలేదు. పెళ్లి తర్వాత ఆమె సినీ పరిశ్రమకు దూరంగా ఉండవచ్చుననే ప్రచారం సాగినప్పటికీ… ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది. భర్త, అత్త మామల నుంచి అనుమతి మేరకే నిహారిక మళ్లీ నటనకు సిద్ధమైనట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Also Read: విశాఖ సాగర తీరంలో కొలువుతీరనున్న దేవదేవుడు.. ముహూర్తం ఫిక్స్

దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..