AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Nimajjanam: హుస్సేన్‌ సాగర్‌లో ఈ ఏడాది నిమజ్జనం నిషేధించాలి… హైకోర్టులో పిటిషన్‌.

Vinayaka Nimajjanam Hyderabad: వినాయక చవితి వేడుకలకు సమయం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో చవితి వేడుకలు ప్రారంభంకానున్నాయి. అలాగే చవితి వేడుకలు...

Vinayaka Nimajjanam: హుస్సేన్‌ సాగర్‌లో ఈ ఏడాది నిమజ్జనం నిషేధించాలి... హైకోర్టులో పిటిషన్‌.
Vinayaka
Narender Vaitla
|

Updated on: Aug 05, 2021 | 2:36 PM

Share

Vinayaka Nimajjanam Hyderabad: వినాయక చవితి వేడుకలకు సమయం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో చవితి వేడుకలు ప్రారంభంకానున్నాయి. అలాగే చవితి వేడుకలు ముగిసిన తర్వాత నెల రోజులకు దేవి శరన్నవరాత్రోత్సవాలు కూడా ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలోనే విగ్రహ నిమజ్జన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో హుస్సేన్‌ సాగర్‌ ఒకటి. ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం కారణంగా కాలుష్యం పెరుగుతుందని పర్యావరణ ప్రియులు ఆరోపిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా హుస్సేన్‌ సాగర్‌లో వినాయక, దుర్గ విగ్రహాల నిమజ్జనంను ఈ ఏడాది నిషేధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ సందర్భంగా హైకోర్టు వేడుకలపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగుకాలేదని, కాబట్టి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ఏర్పాట్లపై అనుమతి ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీంతో తమ నిర్ణయాన్ని శుక్రవారం తెలుపుతామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇక కేసు విచారణను హైకోర్టు ఆగస్టు 11కి వాయిదా వేసింది. మరి వినాయక, దుర్గ విగ్రహాల నిమజ్జనం, వేడుకల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక గతేడాది కూడా కరోనా ప్రభావం కారణంగా ప్రభుత్వం హైదరాబాద్‌లో వినాయక వేడుకలపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రధాన రహదారులపై కాకుండా కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, బస్తీల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన విషయం విధితమే. ఇక జిల్లాల్లోనూ గతేడాది వినాయక వేడులకు కోవిడ్‌ నిబంధనలను అనుసరించే జరిగాయి.

Also Read: SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ సమయాల్లో డిజిటల్ లావాదేవీలు పని చేయవు.!

Amara Raja: ఏపీ నుంచి అమరరాజా కంపెనీ తరలిపోనుందా?.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసి అడ్డంగా దొరికిన బాయ్‌ఫ్రెండ్.. అతడు చెప్పిన రీజన్‌కు పోలీసులు షాక్.!