Congress: కాంగ్రెస్‌లో కొత్త కల్చర్.. గీత దాటితే వేటు తప్పదు.. టీ పీసీసీలో కోవర్ట్స్ ఏరివేత షురూ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌ల ఏరివేత మొదలయిందా.. రేవంత్ టీం ఆ పనిలోనే నిమగ్నమయిందా.. పార్టీ గాడిలో పడాలంటే కోవర్ట్ ల ఏరివేత తప్పదని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Congress Action Plan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌ల ఏరివేత మొదలయిందా.. రేవంత్ టీం ఆ పనిలోనే నిమగ్నమయిందా.. పార్టీ గాడిలో పడాలంటే కోవర్ట్ ల ఏరివేత తప్పదని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మీడియా ముందు మాట్లాడే నేతలకు రేవంత్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే నాయకులకు విపరీతమైన స్వేచ్ఛ ఉండే పార్టీ ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు పార్టీలో ఉంటూనే అదే పార్టీ నాయకులపైన కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు నాయకులు. ఎక్కడైనా తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ పార్టీ లో ఉండేది. అయితే, దీనివల్ల అంతర్గత విభేదాలు.. కోవర్ట్‌లు తయారై పార్టీకి నష్టం కలిగిస్తున్నారని కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇకపై కఠినంగా వ్యవహరీంచాలని నిర్ఱయించుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వొచ్చినట్లు మాట్లాడితే కఠిన మైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా జరిచేస్తుందట.
రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కోవర్ట్‌ల అంశం పదే పదే తెరపైకి వస్తోంది. ఇప్పుడు ఈ ముచ్చటే పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌కు కోవర్ట్‌గా ఇన్ని రోజులు పనిచేశాడు. అందుకే, ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు కొట్టేశాడనేది రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఈ అంశాన్నీ ప్రతీ మీటింగ్‌లోనూ ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్న మిగిలిని కోవర్ట్‌లను వెంటనే బయటకు వెళ్లిపోవాలి.. లేదంటే బహిష్కరించాల్సి వస్తుందని పదే పదే హెచ్చరిస్తున్నారు కొత్త బాస్ రేవంత్ రెడ్డి.
అయితే టీ కాంగ్రెస్ కొంత మంది ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్‌గా పనిచేస్తున్నారని రేవంత్ టీం అనుమానిస్తోంది. వారందరికి చెక్ పెట్టకపోతే పార్టీ బలహీనపడే అవకాశం ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే పార్టీలో ఇంటి గుట్టు బజారుకు ఈడ్చుస్తున్నవారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ కోవర్ట్ ల పై దృష్టి పెట్టారట. ముఖ్యంగా మీడియాతో ఇంటా – బయట మాట్లాడే నేతలు ఆచి తూచి మాట్లాడలాలని పార్టీ అంతర్గత మీటింగ్‌లలో రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడే నేతలు పార్టీకి ఇబ్బంది కలిగేవిధంగా వాఖ్యలు చేస్తే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా చర్యలు ఉంటాయని రేవంత్ హెచ్చరికలు జారీ చేస్తున్నారట.
ఇదిలావుంటే, ఇందు కోసం పీసీసీ రేవంత్ రెడ్డి ప్రత్యేక టీమ్‌నే ఏర్పాటు చేసుకున్నారట. పార్టీలో కోవర్ట్‌లను కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్న నేతలపై ప్రత్యేక నజర్ వేసి ఉంచినట్లు సమాచారం. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని చూపిస్తూ ఎలాంటి చర్యలకు అయిన రెడీ అనే సంకేతాలు పంపుతున్నారు. చూడాలి మరీ ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు సెట్‌రైట్ అవుతారో లేదో…
— బి.అశోక్ , టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్
Read Also…. Supreme Court: మీడియా వార్తలు నిజమే అయితే సీరియస్ మ్యాటరే ..పెగాసస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య