వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Dalit Bandhu: వాసాలమర్రికి సంబంధించిన దళిత బంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది...

వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
Cm Kcr
Follow us

|

Updated on: Aug 05, 2021 | 8:27 PM

‘దళిత బంధు’ పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో భాగంగా సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రికి దళిత బంధు నిధులను విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

మొత్తం గ్రామంలోని 76 కుటుంబాలకు గానూ రూ. 7.60 కోట్లను జిల్లా కలెక్టర్‌ అకౌంట్‌లోకి జమ చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. దీనికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘దళిత బంధు’ నిధుల విడుదలతో వాసాలమర్రి గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామ ప్రజలు డప్పులు కొడుతూ.. టపాసులు కాల్చడమే కాకుండా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

కాగా, నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ హుజురాబాద్‌ కంటే ముందుగా వాసాలమర్రిలోనే దళితబంధు ప్రారంభమవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ దళిత బంధు నిధులను గురువారం విడుదల చేసింది.