Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు జలకళ .. మొదలైన పర్యాటకుల సందడి.. ఊరిస్తున్న చేపల వంటకాలు

Surya Kala

Surya Kala |

Updated on: Aug 05, 2021 | 12:42 PM

Jurala Project: ఎగువ రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో కృష్ణమ్మ అందాలు చూడడానికి నదీ ప్రవాహాన్ని తిలకించేందుకు...

Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు జలకళ .. మొదలైన పర్యాటకుల సందడి.. ఊరిస్తున్న చేపల వంటకాలు
Jurala Project

Follow us on

Jurala Project: ఎగువ రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో కృష్ణమ్మ అందాలు చూడడానికి నదీ ప్రవాహాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు చేరుకుంటున్నారు.అవును జూరాల ప్రాజెక్టు చుట్టూ కృష్ణమ్మ అందాలు, ప్రాజెక్టు నుండి దూకుతున్న నీటి పరవళ్లు, నోరూరించే చేపల రుచులతో ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. కృష్ణవేణి సోయగాలను తనివితీరా చూసి ఆనందిస్తూ ప్రాజెక్టు వద్ద నోరూరించే చేపల వంటకాలు ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. జూరాల ప్రాజెక్టు వద్ద చేపల వంటకాలు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు సందర్శకులతో కళకళలాడుతోంది. 20 రోజులుగా జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఉంచడంతో పర్యాటకుల సందడి రోజు రోజుకు పెరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కృష్ణమ్మ అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు.

ప్రకృతి అందాలతో పాటు జూరాల ప్రాజెక్టు వద్ద చేపల వంటకాలను తిని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. జూరాల ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద వరుసగా చిన్న చిన్న హోటళ్లు ఉంటాయి. ఈ హోటళ్లకు పైభాగంలో డ్యాముకు ఎడమవైపు చేపలు విక్రయిస్తున్నారు. అప్పుడే ఫ్రేష్ గా డ్యాములో పట్టుకొచ్చిన చేపలను అమ్ముతుంటారు. డ్యాము చూసేందుకు వచ్చే పర్యాటకులు వాటిని కొనుగోలు చేసి హోటళ్ల వాళ్లకు ఇస్తారు. కొద్ది నిమిషాల్లో చేప ఫ్రై, చేపల పులుసు రెడీ చేస్తారు. అంతేగాక పర్యాటకులు కోరిన విధంగా వండి వడ్డిస్తారు. అహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ.. జూరాల ప్రాజెక్టు లో దొరికే లైవ్ చేపల్ని అక్కడ వివిధ రకాల రుచుల్లో తిని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. జూరాల చేపల వంటకాలను తినేందుకు హైదరాబాద్ తో పాటు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. జూరాల చేపల వంటకాల రుచి వేరని అంటున్నారు భోజన ప్రియులు. ఐతే ప్రాజెక్ట్ ను చూడడానికి వస్తున్న కొందరు సందర్శకులు నిబంధనలు పట్టించుకోవడం లేదు.. దీంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముంది.. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు

Tv9 reporter : SAMI, MAHABUBNAGAR.

Also Read: Tokyo Olympics 2020: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్తాన్ కోడలు వద్దు. తెలుగు తేజం ముద్దు అంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu