- Telugu News Photo Gallery Spiritual photos Ancient Siva Lingam Stone of Destiny on Hill of Tara in Ireland
Ancient Shiva Linga: మహిమాన్విత దేవుడిగా క్రైస్తవులతో పూజలందుకుంటున్న శివలింగం.. ఏ దేశంలోనంటే..
Ancient shiv ling in ireland: భోళాశంకరుడిగా హిందువులతో లింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. శివయ్య విగ్రహాలు మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. లింగమయ్య గుడిలో ఎన్నో రహస్యాలు .. మరెన్నో మర్మాలు దాగున్నాయి. ఆలాంటి ఓ ఆలయం యురేపియన్ లోని ఐర్లాండ్ దేశంలో ఉంది.
Updated on: Aug 05, 2021 | 3:01 PM

యూరప్‌లో ని ఐర్లాండ్‌లో భారతీయ శివలింగం ఎలా వచ్చిందనే ప్రశ్న ఎప్పటినుంచ్చో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కొండపై... చుట్టూ ఇటుకలతో గుండ్రంగా నిర్మించిన ఆకారం మధ్యలో ఆ పొడవైన శివలింగం ఉంది

ఈ శివలింగాన్ని ఎప్పుడు ఎవరు ఎక్కడ ప్రతిష్టించారో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు.. అందుకనే ఇదొక రష్యా రాయిని ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే స్థానికంగా లియా ఫాయిల్ అని పిలుస్తారు. ఈ లింగాన్ని పూజిస్తారు

అతిపురాతన లింగాన్ని క్రైస్తవ సన్యాసులు పునరుత్పత్తికి చిహ్నంగా భావి పూజించేవారు. ఈ లింగం ప్రస్తావన మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్ నేనే గ్రంధంలో ఉంది.

క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య ఈ ప్రాంతంలో ఈ శివలింగాన్ని త్వాతా డి డానన్ తెచ్చినట్లు చారిత్రాత్మక కథనం.త్వాతా డి డానన్ ను... డాను అనే దేవత కొడుకుగా చెప్పేవారు. యూరప్ పురాణాల ప్రకారం... డాను దేవత... నది దేవత. డాన్యూబ్, డాన్, డానిపెర్, డానిస్టర్ నదులకు డాను దేవత పేరుతో సంబంధం కనిపిస్తుంది.

మన వేదాల్లో కూడా డాను దేవత ప్రస్తావన ఉంది. ఆమె కశ్యప ముని భార్య అయిన దక్ష కూతురు. ఆమె నదులకు అధిపతి. డాను అంటే ప్రవహించే నీరు అని సంస్కృతంలో అర్ధం. ఐర్లాండ్‌లో లియా ఫాయిల్ కి వేద సంస్కృతంలో శివుడికీ సంబంధం ఉన్నాదని చారిత్రికుల కధనం

ఈ శివలింగాన్ని ‘లియా ఫెల్’ అని పిలుస్తారు. అంటే స్థానిక భాషలో ‘అదృష్ట శిల’ అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేయానికి గతంలో చాలా మంది ప్రయత్నించారు. 2012 జూన్‌లో గుర్తు తెలియని కొంతమంది రాయితో 11 సార్లు ధ్వసం చేయడానికి ప్రయత్నించారు. 2014 మేలో కూడా ఈ లింగంపై ఎరుపు, గ్రీన్ కలర్స్ వేశారు. ఎవరో దీనిపై తాంత్రిక పూజలు చేశారనే స్తానికులు చెప్పారు.. ఈ లింగాన్ని ఐర్లాండ్ ప్రభుత్వం కాపాడాలని కోరుతున్నారు.




