Supreme Court: మీడియా వార్తలు నిజమే అయితే సీరియస్ మ్యాటరే ..పెగాసస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
పెగాసస్ వివాదంపై మీడియాలో వచ్చిన వార్తలు, ఆరోపణలు నిజమే అయితే ఇది తీవ్రమైన విషయమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో అసలు అంశాలు బయటికి రావలసి ఉందని.. ఎవరి పేర్లు ఇందులో ఉన్నాయో తమకు తెలియదని సీజేఐ
పెగాసస్ వివాదంపై మీడియాలో వచ్చిన వార్తలు, ఆరోపణలు నిజమే అయితే ఇది తీవ్రమైన విషయమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో అసలు అంశాలు బయటికి రావలసి ఉందని.. ఎవరి పేర్లు ఇందులో ఉన్నాయో తమకు తెలియదని సీజేఐ ఎన్. వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన బెంచ్ పేర్కొంది. దేశాన్ని కుదిపివేస్తున్న ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన బెంచ్.. వచ్చే మంగళవారం మళ్ళీ వీటిపై విచారణ జరపాలని నిర్ణయించింది. పిటిషనర్లు అంతా వీటికి సంబంధించిన కాపీని కేంద్రానికి పంపాలని బెంచ్ సూచించింది. 2019 లో కూడా స్నూపింగ్ (ఫోన్ ట్యాపింగ్) కి సంబందించి వార్తలు వచ్చాయని, ఆ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నాలు జరిగాయో లేదో తనకు తెలియదని జస్టిస్ రమణ అన్నారు. ప్రతి కేసు జోలికి తాము పోవడంలేదని, తమ ఫోన్లు ట్యాపింగ్ కి గురైనట్టు కొందరు ఆరోపిస్తున్నారని పేర్కొన్న ఆయన.. ఇలాంటి ఫిర్యాదుల కోసం టెలిగ్రాఫ్ చట్టం ఉందన్నారు.
పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ లాయర్.. కపిల్ సిబాల్.. పెగాసస్ అంశం తీవ్రమైనదని, ఇది వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించేదని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి లేదా మాజీ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే విచారణ అవసరం లేదని, ప్రభుత్వ సంస్థలేవీ ఫోన్లను ట్యాప్ చేయడంలేదని కేంద్రం తరఫు అడ్వొకేట్ వాదించారు. ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ కి గురి కావడం లేదు.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందనక్కరలేదు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా , ఓ ఎంపీ, ఓ లాయర్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.