NTA JEE Mains 2021 Result Date: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2021 సెషన్ 3 పరీక్షలను జూలై 20, 22, 25, 27 తేదీలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఎన్‌టిఏ ఇప్పటికే తాత్కాలిక ఆన్సర్ కీ ని విడుదల చేసింది. ఈ ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే జులై 31వ తేదీ వరకు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించింది. ‘కీ’ పై అభ్యంతరాలకు గడువు ముగిసిన నేపథ్యంలో.. త్వరలోనే జేఈఈ మెయిన్స్ ఫలితాలను ప్రకటించేందుకు ఎన్టీఏ సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీయే జేఈఈ మెయిన్ 2021 సెషన్ 3 ఫలితాలను వెల్లడించినట్లయితే.. అభ్యర్థులు తమ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ అయిన jeemain.nta.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
అయితే, ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మరి ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ 3 పరీక్ష రాసిన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ అయిన jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు లాగిన్ ఇవ్వాలి. 2. ఆ తరువాత అభ్యర్థులు హోమ్ పేజీలో ఉండే జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. 3. అలా ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు.. జేఈఈ మెయిన్ 2021 ఎగ్జామ్ సెషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అలా సెలక్ట్ చేసుకున్న తరువాత.. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్‌మిట్ కొట్టాలి. 4. అన్ని వివరాలు నమోదు చేసి.. సబ్మిట్ కొట్టాక రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
కాగా, సవరించిన తుది ఆన్సర్ ‘కీ’ ఆధారంగా ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ – 2021 రూపొందించి ప్రకటించనున్నారు. ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ 2021 అభ్యర్థులు రిజల్ట్స్, ఇతర అప్‌డేట్స్ కోసం తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ అయిన nta.nic.in, jeemain.nta.nic.in లను గమనిస్తుండాలి.
Also read:
Amara Raja: ఏపీ నుంచి అమరరాజా కంపెనీ తరలిపోనుందా?.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Supreme Court: మీడియా వార్తలు నిజమే అయితే సీరియస్ మ్యాటరే ..పెగాసస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసి అడ్డంగా దొరికిన బాయ్‌ఫ్రెండ్.. అతడు చెప్పిన రీజన్‌కు పోలీసులు షాక్.!