గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసి అడ్డంగా దొరికిన బాయ్‌ఫ్రెండ్.. అతడు చెప్పిన రీజన్‌కు పోలీసులు షాక్.!

గత కొద్దిరోజులుగా తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఆరోగ్యం సరిగ్గా లేదని తన స్నేహితులకు చెబుతూ వచ్చిన ఓ వ్యక్తి అనూహ్యంగా ఆమెను కడతేర్చాడు...

గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసి అడ్డంగా దొరికిన బాయ్‌ఫ్రెండ్.. అతడు చెప్పిన రీజన్‌కు పోలీసులు షాక్.!
Girl Friend Drown

ప్రేమ వ్యవహారంలో చిన్నచిన్న అపార్ధాలు జీవితాలను తలక్రిందులు చేస్తుంటాయి. పగ-ప్రతీకారాలతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటన దుబాయ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని అతి కిరాతకంగా బాత్‌టబ్‌లో ముంచి చంపేయడమే కాకుండా.. పోలీసుల విచారణలో వింత రీజన్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

గత కొద్దిరోజులుగా తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఆరోగ్యం సరిగ్గా లేదని తన స్నేహితులకు చెబుతూ వచ్చిన ఓ వ్యక్తి అనూహ్యంగా ఆమెను కడతేర్చాడు. సందర్భం చూసుకుని ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి.. బాత్‌టబ్‌లో ముంచి చంపేశాడు. ఏమి తెలియనట్లుగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించి.. హాస్పిటల్‌కు తరలించాడు. అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారాన్ని అందించాడు. దీనితో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ విషయంపై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ”సదరు యువతి చనిపోయిన రోజు నిందితుడు మద్యం సేవించినట్లుగా తేలింది. అంతేకాకుండా ఆ యువతిని చంపడానికి కొద్దిసేపటి ముందు ” నా గర్ల్‌ఫ్రెండ్‌ను జీనీ దెయ్యం అవహించింది” అంటూ అతడు ఓ స్నేహితుడికి ఫోన్ చేసినట్లు స్పష్టమైంది. చంపడానికి ముందుగా ఆమెను కొట్టినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. నిందితుడికి అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయి. అతడి స్నేహితులు, పక్కింటివాళ్ల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశామని” పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

Read Also: 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం

బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

Click on your DTH Provider to Add TV9 Telugu