Tokyo Olympics: 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో జర్మనీపై 5-4తో విజయాన్ని సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆరంభంలో భారత హాకీ టీం కాస్త తడబడినా.. ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌లు ఎక్కువగా నమోదు కావడం విశేషం.
అంతకముందు మ్యాచ్ ఆరంభంలో రెండో నిమిషానికి ప్రత్యర్ధి జర్మనీ జట్టు గోల్ వేయగా.. భారత్ మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్ తర్వాత భారత్ పుంజుకుంది. సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమం అయింది. అటు మూడో క్వార్టర్‌లో భారత్, జర్మనీ అమీతుమీ తెల్చుకున్నాయి. మొదట జర్మనీ రెండు గోల్స్ వేయగా, ఆ తర్వాత పెనాల్టీ కార్నర్‌లు అందిపుచ్చుకుని భారత్ హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో స్కోర్ సమం చేసింది.
ఇక మూడో క్వార్టర్‌లో భారత్ పూర్తిగా పైచేయి సాధించింది. ఆరంభంలో ఒక గోల్.. ఆ వెంటనే మరో గోల్ సాధించి 5-3తో ఆధిక్యం సాధించింది. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్ధికి మరో గోల్ దక్కకుండా డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లి గేమ్‌ను ముగింపుకు తీసుకొచ్చింది. ఇక చివర్లో జర్మనీ గోల్ చేయడంతో స్కోర్ 4-5 కాగా.. అక్కడ నుంచి మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. ఆఖర్లో జర్మనీ షూట్ అవుత పెనాల్టీని అడ్డుకోవడంతో భారత్ అపూర్వ విజయాన్ని అందుకుంది.
హాకీ జట్టుకు ప్రధాని శుభాకాంక్షలు..
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. కాంస్య పతకాన్ని దేశానికీ తీసుకొస్తున్న పురుషుల జాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. భారతీయుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశారంటూ వారిని కొనియాడారు. దేశంలో మిమ్మల్ని చూసి గర్విస్తోందని.. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Historic! A day that will be etched in the memory of every Indian.
Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. ?
— Narendra Modi (@narendramodi) August 5, 2021
41 years was a long wait . ? Well done boys @manpreetpawar07 and Team . You’ve been stunning on the field . We are all so proud of you . Jai Hind ?? pic.twitter.com/YZgAevDYaE
— Harmanpreet Kaur (@ImHarmanpreet) August 5, 2021
Heartiest Congratulations to the Indian Men’s hockey team! We are super proud of your efforts & this victory will forever be cherised! #Hockey #Olympics #Tokyo2020 ? pic.twitter.com/OxLqRfney0
— Suresh Raina?? (@ImRaina) August 5, 2021
?? #UnitedByEmotion pic.twitter.com/Zhbya2xbcA
— #Tokyo2020 (@Tokyo2020) August 5, 2021
Heartiest Congratulations to the Indian Hockey team for winning the Bronze medal in a keenly fought contest against Germany! The team displayed excellent professionalism and the entire nation is proud of their achievement. @TheHockeyIndia #Hockey #Tokyo2020 pic.twitter.com/Xoshs6G13T
— Vice President of India (@VPSecretariat) August 5, 2021
Read Also: బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!
మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!