AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Balaji: విశాఖ సాగర తీరంలో కొలువుతీరనున్న దేవదేవుడు.. ముహూర్తం ఫిక్స్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఇక విశాఖ‌ సాగరతీరంలో కొలువుదీరబోతున్నాడు. రిషికొండల్లో ఒకటైన పర్యతంపై సర్వాంగ...

Lord Balaji:  విశాఖ సాగర తీరంలో కొలువుతీరనున్న దేవదేవుడు.. ముహూర్తం ఫిక్స్
Lord Balaji Temple In Vizag
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2021 | 4:11 PM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఇక విశాఖ‌ సాగరతీరంలో కొలువుదీరబోతున్నాడు. రిషికొండల్లో ఒకటైన పర్యతంపై సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టీటీడీ దేవాలయం కోసం 10 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. 10 ఎకరాల్లో ఏర్పాటుచేసిన దేవాలయంలో ఈ నెల 11న దేవదేవుని విగ్రహ ప్రతిష్ట జరగనుంది. 8న అంకురార్పణ, 13న సంప్రోక్షణ జరగనుంది. ఇక ఆ తర్వాత 13న మధ్యాహ్నం నుంచి భక్తులకు దేవదేవుని దర్శనం లభించనుంది. 28కోట్ల రూపాయల వ్యయంతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని.. తిరుమల ఆలయ నమూనాలో తీర్చిదిద్దింది టీటీడీ.  ఒకవైపు సముద్రం.. మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు.. సాగం తీరం మరింత ప్రియం కానుంది.

తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీవారికి పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం.. దానికి ఎదురుగా టీటీడీ ఈ-దర్శనం కౌంటర్‌ ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆలయ పనులు కంప్లీట్ అవ్వడంతో.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది శ్రీవారి ఆలయం. వివిధ కారణాల వల్ల తిరుమల వెళ్లలేనివారు.. విశాఖలోనే దేవదేవుడుని దర్శించుకోవచ్చు. ప్రసాదాలు పొందవచ్చు.. ప్రత్యేక పూజులు చేయించుకోవచ్చు. మెుత్తంగా తిరుమల వెంకన్న విశాఖలోనే దర్శనం ఇవ్వనుండటంతో.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు భక్తులు.

తిరుమలలో కాషన్‌ డిపాజిట్‌ అమలు

తిరుమలలో గదుల కేటాయింపులో కాషన్​ డిపాజిట్​ విధానాన్ని టీటీడీ మళ్లీ ప్రారంభించింది. అద్దె గదులు పొందే వారి నుంచి 500 రూపాయలకన్నా తక్కువ ఉన్న గదులకు 500 రూపాయలు.. అంతకన్నా ఎక్కువ ఉన్న గదులకు అద్దెకు సమానంగా డిపాజిట్‌ ను వసూలు చేస్తున్నారు. 2017వ సంవత్సరంలో భక్తుల సౌకర్యార్థం ఈ విధానంను రద్దు చేశారు. నేటి నుంచి మరలా తిరిగి స్టార్ట్ చేశారు. గదులు కేటాయించే సమయంలోనే అద్దెతో పాటు కాషన్‌ డిపాజిట్‌ను వసూలు చేస్తున్నారు. డిజిటల్‌ పేమెంట్​ను మాత్రమే అమలు చేస్తున్న టీటీడీ.. రూమ్ ఖాళీ చేసిన తరువాత వారి బ్యాక్‌ ఖాతాకు డిపాజిట్‌ మొత్తం తిరిగి చేరేలా సాంకేతికతను ఏర్పాటు చేశారు.

Also Read: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు

దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!