Officers Fight: విశాఖ దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట, ఆఫీస్‌లో డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక, మట్టి విసిరిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

విశాఖలో దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి

Officers Fight: విశాఖ దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట, ఆఫీస్‌లో డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక, మట్టి విసిరిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి
Ofificials Fight
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 05, 2021 | 3:00 PM

Endowment higher officials fight in office: విశాఖలో దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుక, మట్టితో దాడి చేశారు. ఈ దాడి విజువల్స్‌ ఆఫీసులోని సీసీకెమరాలో రికార్డు అయ్యాయి. కొద్దిరోజులుగా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా డిప్యూటీ కమిషనర్ ప్రచారం చేస్తున్నారని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఆరోపిస్తోంది.

అయితే, డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌ మాత్రం శాంతి ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి కారణాలు లేకుండా తనపై దాడికి పాల్పడ్డారని చెప్పుకొస్తున్నారు. పోలీసు విచారణలో అసలు వాస్తవాలు వెల్లడవుతాయని అంటున్నారు. ఈ ఘటన దేవాదాయ శాఖలో కలకలం రేపింది. కాగా, ఒక అధికారి సస్పెన్షన్‌ ఘటనలో డీసీ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధ్య తలెత్తిన విభేదాలు.. ఘర్షణకు దారి తీశాయని తెలుస్తోంది.

ఇలా ఉంటే, అధికారుల వ్యవహారాలపై జనం మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉన్నతాధికారులే ఇలా ప్రవర్తిస్తుంటే, వీళ్లు ప్రజలకు ఏమి సేవ చేస్తారంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Read also: GRMB: కేంద్రప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు