AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టికి ఇది గడ్డుకాలం. పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం సంచలనం రేపింది. భర్త అరెస్ట్‌తో చాలా బాధలో...

Shilpa Shetty:  దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!
Shilpa Shetty
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 05, 2021 | 1:52 PM

Share

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టికి గడ్డుకాలం నడుస్తోంది. పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం సంచలనం రేపింది. భర్త అరెస్ట్‌తో చాలా బాధలో ఉన్న శిల్పాశెట్టికి ఇంకో షాక్‌ కూడా తగిలింది. సూపర్‌ డాన్సర్‌ చాప్టర్‌ 4 రియాల్టీ షోకు జడ్జిగా ఉన్న శిల్ప భర్త అరెస్టయినప్పటికి నుంచి షూటింగ్‌కు హాజరుకావడం లేదు. దీంతో ఆమె నష్టపోయిన డబ్బు ఎంతో తెలుసా ? అక్షరాలా రెండు కోట్ల రూపాయలట. సూపర్‌ డాన్సర్‌షోకు అధిక పారితోషికం తీసుకుంటున్న జడ్జిగా శిల్ప ఉన్నారు. ప్రతి ఎపిసోడ్‌కు ఆమెకు 18 నుంచి 22 లక్షల రూపాయల వరకు నిర్వాహకులు చెల్లిస్తున్నారు. అయితే భర్త అరెస్టయిన బాధలో ఉన్న బాలీవుడ్‌ స్టార్‌కు ఫైనాన్షియల్‌గా కూడా చాలా లాస్‌ వచ్చింది. రాజ్‌కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పట్లో సూపర్‌ డాన్సర్‌షో షూటింగ్‌కు శిల్పాశెట్టి హాజరుకావడం అనుమానమే. మరింత డబ్బును ఆమె నష్టపోయే అవకాశాలున్నాయి. సూపర్‌ డాన్సర్‌ షోకు శిల్పాశెట్టి స్థానంలో ఇప్పడు కరిష్మా కపూర్‌ జడ్జిగా వచ్చారు.

అయితే షోనుంచి శిల్పాశెట్టిని తొలగించే విషయంపై ఇంకా ఆ చానెల్‌ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శిల్పాశెట్టి సన్నిహితులు మాత్రం మరో నెలరోజుల్లో ఆమె షూటింగ్‌కు వస్తారని చెబుతున్నారు. అప్పటివరకు రాజ్‌కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తుందన్న అంచనాలో శిల్పాశెట్టి ఉన్నారు. గత నెల 19వ తేదీన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. పోర్నోగ్రఫీ కేసుతో భర్తతో పాటు శిల్పాశెట్టి ప్రమేయం కూడా ఉందా ? అన్న విషయంపై ముంబై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టిని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు రెండుసార్లు విచారించారు. అయితే పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఉన్నట్టు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

Also Read:మాయదారి వడ్డీ డబ్బు.. పుస్తెల తాళి ఇచ్చినా, పతి దేవుడ్ని కాపాడుకోలేకపోయింది

ప్రేమన్నాడు.. ప్రాణంకన్నా ఎక్కువన్నాడు..పెళ్లి తర్వాత మూన్నాళ్లకే..

భార్య భర్తల మధ్య చిన్న గొడవ.. ఆతర్వాత అన్ని అపశకునాలే.. ఆయుష్షు తీరిందని ఆత్మహత్య

క్యాన్సర్ బాధితుల కోసం తల వెంట్రుకలు త్యాగం.. ఎంత పెద్ద మనసో చిట్టీ నీది..