Yellandu: ప్రేమన్నాడు.. ప్రాణంకన్నా ఎక్కువన్నాడు..పెళ్లి తర్వాత మూన్నాళ్లకే..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Aug 04, 2021 | 6:11 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న మహిళ ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి  వెళ్తే.. 

Yellandu: ప్రేమన్నాడు.. ప్రాణంకన్నా ఎక్కువన్నాడు..పెళ్లి తర్వాత మూన్నాళ్లకే..
Marriage
Follow us

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక్కడిదాకా అంతా సాఫీగానే సాగింది. పెళ్లయిన మూడు రోజులకే ప్రేమికుడి అసలు రంగు బయటపడింది. రోజులు గడవకముందే నువ్వు నాకు నచ్చలేదంటూ నడిరోడ్డుపై వదిలేశాడు ఆ భర్త. ప్రేమికుడి మోసాన్ని ఊహించని ప్రేయసికి కన్నీరే మిగిలింది. చివరకు ఆ బాధితురాలు సూసైడ్‌ అటెంప్ట్‌కు పాల్పడడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన శ్రుతి-దినేష్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇల్లందులో పాత బస్టాండ్‌ ఏరియాకు చెందిన శ్రుతి.. స్టేషన్‌ బస్తీకి చెందిన దినేశ్‌ స్థానికంగా ఓ స్వీట్‌ షాపులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు ఈనెల 1న భద్రాచలం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఉండేందుకు కొత్తగూడెంలో రూం కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు దినేశ్‌ను కొట్టి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. అమ్మాయి దినేశ్‌ ఇంటికి వెళ్లగా.. నువ్వు నాకు నచ్చలేదంటూ వెళ్లకొట్టాడు భర్త. తీవ్ర మనస్థాపానికి గురైన శ్రుతి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రుతి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.

నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్​..

నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. రెండో రోజు ఉదయం నుంచే అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నాగర్​ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ శివారులోని పురులగుట్ట వద్ద.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. మన్ననూర్​కు చెందిన ఓ బాలికను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో చిన్నారి బిగ్గరగా కేకలు వేసింది. ఓ మహిళ ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పింది. స్థానికులు అమ్రాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ బీసన్న సిబ్బందితో కలిసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ నరసింహులు, ఇతర పోలీసు సిబ్బంది కిడ్నాప్​పై ఆరా తీస్తున్నారు. ఇంతవరకూ బాలిక ఆచూకీ తెలియలేదు.

Also Read: మాయదారి వడ్డీ డబ్బు.. పుస్తెల తాళి ఇచ్చినా, పతి దేవుడ్ని కాపాడుకోలేకపోయింది

 ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu