Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలను..

Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు
Ap Curfew
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 1:53 PM

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ బారిన పడకుండా ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. గతంలోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని పోలీసులు గుర్తుచేస్తున్నారు. అధికారులు చాలా చోట్ల కర్ఫ్యూ సమయాన్ని పెంచారు. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు చోట్ల ఇంకా కఠినంగా ఆంక్షలు పెట్టారు. పలు మండలాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంది.

నెల్లూరు జిల్లాలో.. గురువారం నుంచి పాక్షిక లాక్ డౌన్ ఈ మండలాల్లోనే

1. ఆత్మకూరు 2. ఏ ఎస్ పేట 3. వింజమూరు 4. ఉదయగిరి 5. కలువాయి 6. సంగం 7, మర్రిపాడు 8. అనంతసాగరం 9. చేజర్ల 10. సీతారామపురం

ఈ మండలాలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆంక్షలు అమలు చేస్తోన్న ప్రాంతాలలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత షాపులు తెరిచి ఉన్నా, అనవసరంగా ఎవరైనా బయట తిరిగినా కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.  కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆర్డిఓ చైత్ర వర్షిని తెలిపారు.

ప్రభుత్వం కూడా కరోనా కేసుల పెరుగుదలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కొవిడ్‌పై ఇటీవల సీఎం జగన్ చేసిన రివ్యూలోనూ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లపైనా ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వీలైనంత తొందరగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో, వైద్యులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Also Read: లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో.. కనీసం మీ ఊహకు కూడా అందవు

ఆడాళ్ల జోలికి వస్తే బెండు తీస్తున్న ‘షీ టీమ్స్’.. మూడేళ్లలో ఎంతో మార్పు

క్యాన్సర్ బాధితుల కోసం తల వెంట్రుకలు త్యాగం.. ఎంత పెద్ద మనసో చిట్టీ నీది..

జూరాల ప్రాజెక్ట్‌కు జలకళ .. మొదలైన పర్యాటకుల సందడి.. ఊరిస్తున్న చేపల వంటకాలు

ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..