SHE Teams: ఆడాళ్ల జోలికి వస్తే బెండు తీస్తున్న ‘షీ టీమ్స్’.. మూడేళ్లలో ఎంతో మార్పు

ఆడవాళ్ల జోలికొస్తే తాట వొలుస్తామంటోంది తెలంగాణ షీ టీమ్స్. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు...

SHE Teams: ఆడాళ్ల జోలికి వస్తే బెండు తీస్తున్న 'షీ టీమ్స్'.. మూడేళ్లలో ఎంతో మార్పు
She Teams
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2021 | 3:57 PM

ఆడవాళ్ల జోలికొస్తే తాట వొలుస్తామంటున్నాయి తెలంగాణ షీ టీమ్స్. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం…వారి రక్షణ కోసం షీ టీమ్స్‌ని 2018లో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఊపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేస్తోంది ఈ మహిళ రక్షణ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 331 టీమ్స్ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్ స్టార్ట్ అయిన కొత్తలో దాదాపు 5వేలకు పైగా కేసులు వచ్చేవి..కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతంలో మైనర్లు క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యేవారు. షీ టీమ్స్‌ ఇలాంటి కేసుల్లో పేరెంట్స్‌కి కౌన్సిలింగ్ ఇవ్వడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది తొలి 6 నెలల్లో మొత్తం 2800పైగా కేసులు వస్తే …అందులో 1251మంది ఆకతాయిలు, పోకిరీలను అరెస్ట్ చేసింది షీ టీమ్స్ వ్యవస్థ. ఇందులో ఎక్కువగా 25 సంవత్సరాల వయస్సున్న యువకులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా తెలంగాణ విమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా చెబుతున్నారు. ఎవరైనా వేధిస్తే గతంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మహిళలు ముందుకొచ్చే వాళ్లు కాదని…కాని ఆన్‌లైన్‌లో, వెబ్‌ సైట్ ద్వారా అవగాహన కల్పించడంతో ఫిర్యాదులు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి… ఏదైనా సమస్య వస్తే వెంటనే మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి… ఇప్పుడు మహిళలకు అండగా ఉంటుందని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు.

Also Read:విషాదం.. ఆడుకుంటూ నీటిలో పడ్డ 10 మంది చిన్నారులు..

ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన బంగారు కొండకు భాగ్యనగరంలో గ్రాండ్‌ వెల్‌కమ్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!