Pv Sindhu: ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన బంగారు కొండకు భాగ్యనగరంలో గ్రాండ్‌ వెల్‌కమ్

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పథకం సాధించిన పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో....

Pv Sindhu: ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన బంగారు కొండకు భాగ్యనగరంలో గ్రాండ్‌ వెల్‌కమ్
Pv Sindhu
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2021 | 4:53 PM

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పథకం సాధించిన పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సింధును పోచంపల్లి శాలువాతో సత్కరించారు. ప్రపంచ క్రీడా వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది సింధు. అద్భుతమైన ఆటతీరుతో కాంస్య పథకాన్ని చేజిక్కించుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పథకాలను గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు రికార్డు సృష్టించింది. కాగా సింధుకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు  అభిమానులు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సింధు ఒలింపిక్ పథకం గెలవడం సంతోషంగా ఉందని తెలిపారు. తన అనుభవాలను.. పోరాట తీరును వివరించారు పీవీ సింధు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. కరోనా సమయంలో తన బలహీనతలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. తనకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతగానో కష్టపడినట్టు సింధు తెలిపారు.

సింధుకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం 

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం సింధుకు రూ.30లక్షలు నజరానా అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని.. సింధు విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం సీఎం కొనియాడారు. క్రీడల్లో సత్తా చాటే క్రీడాకారులందరికీ ప్రభుత్వం తరుపున తగిన ప్రోత్సహం అందిస్తామన్నారు.

Also Read: పోలీసుల వాహనంలో ఒక్కసారిగా మంటలు.. హైదరాబాద్ నడిబొడ్డులో కలకలం..!

2021 బ్యాచ్ విద్యార్థులు ఆ ఉద్యోగానికి అనర్హులు.. హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటనపై దుమారం