Hyderabad: పోలీసుల వాహనంలో ఒక్కసారిగా మంటలు.. హైదరాబాద్ నడిబొడ్డులో కలకలం..!
ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి.
Hyderabad car catches fire: పోలీసులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని సైఫాబాద్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్పందించిన డ్రైవర్ కారును నిలిపి అందులోని వారిని కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద పోలీసు వాహనం టాటా సుమో కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్త అయి కారు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. క్షణకాలంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితం బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. కారు డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వ్యాపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఊహించిన ప్రమాదంతో సమీపంలోని వాహనదారులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దీంతో ఖైరతాబాద్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also.. Bobbili: బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాల లెక్కింపులో వెలుగులోకి కొత్త విషయాలు.. ఆరా తీస్తున్న అధికారులు..!
IT Companies: ఐటీ కంపెనీల కొత్త వ్యూహం.. డిసెంబర్ నాటికి అమలుకు కసరత్తు