Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో పతకం ఖాయం.. ఫైనల్ చేరిన రెజ్లర్‌ రవి దహియా

Tokyo Olympics : భారత్‌కి మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్‌లో రవి కుమార్‌ దహియా ఫైనల్‌ చేరాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో పతకం ఖాయం.. ఫైనల్ చేరిన రెజ్లర్‌ రవి దహియా
Wrestler Ravi Dahiya,
Follow us
uppula Raju

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 04, 2021 | 3:58 PM

Tokyo Olympics: భారత్‌కి మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్‌లో రవి కుమార్‌ దహియా ఫైనల్‌ చేరాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌పై రవికుమార్‌ విక్టరీ బైఫాల్‌ కింద గెలుపొందినట్లు ప్రకటించారు. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు. రవికుమార్‌ ఫైనల్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం ఖాయమైంది.

కుస్తీలో రవి గెలుపు సంబరాలు మిన్నంటాయి. హర్యానా లోని ఆయన స్వస్థలం సోనిపట్‌లో గ్రామస్తులు వేడుకలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని పండుగ చేసుకున్నారు. రవిదహియా గెలుపుతో ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమయ్యింది. ఫైనల్‌లో జవుర్‌ ఉగేవ్‌తో గోల్డ్‌ కోసం పోటీ పడతాడు రవిదహియా. ఇదిలా ఉంటే మరోవైపు మహిళ బాక్సింగ్‌ 69 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా సెమీస్‌లో ఓటమి పాలైంది. టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో పరాజయం చెందింది. అయితే, గతనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్‌ చైన్‌పై విజయం సాధించి లవ్లీనా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.

ఒలింపిక్స్ పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ రవికుమార్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖులు రవికుమార్‌కు అభినందనలు తెలిపారు.

TRS: ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు అధైర్యపడొద్దు.. అన్నింటికీ అండగా మేముంటాం : కేటీఆర్