TRS: ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు అధైర్యపడొద్దు.. అన్నింటికీ అండగా మేముంటాం : కేటీఆర్

ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబం అధైర్యపడొద్దని చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ.. కార్యకర్తలకు అన్నివిధాల అండగా ఉంటుందని

TRS: ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు అధైర్యపడొద్దు.. అన్నింటికీ అండగా మేముంటాం : కేటీఆర్
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 04, 2021 | 4:01 PM

KTR – TRS: ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబం అధైర్యపడొద్దని చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ.. కార్యకర్తలకు అన్నివిధాల అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. కొంచెం సేపటి క్రితం తెలంగాణ భవన్లో కేటీఆర్.. పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ కార్యకర్తకైనా ఇంటి పెద్దదిక్కు లేకున్నా.. పార్టీ – కేసీఆర్ అండగా ఉన్నారని ఆయన హామీ ఇచ్చారు.

60 లక్షల సభ్యత్వం కలిగిన అజేయ శక్తిగా టీఆరెస్ పార్టీ ఎదిగిందని పేర్కొన్న కేటీఆర్.. మొత్తం 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆరెస్ పార్టీ కుటుంబమేనన్నారు. కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుల బాధ్యత టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీస్ పై ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఈ బాధ్యతల్ని రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ సెక్రెటరీస్, ఇంచార్జ్ నిర్వర్తిస్తారని కేటీఆర్ చెప్పారు. 80 మంది కుటుంబ సభ్యుల సమస్యల్ని 10 రోజుల్లో పరిష్కరించామని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందర్నీ కంటికి రెప్పలా కాపాడుకుంటామ‌న్న కేటీఆర్.. వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తల కుటుంబాల‌కు ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 80 మంది నాయ‌కులు, కార్యక‌ర్తల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్షల బీమా సాయం అందించి, వారిలో మ‌నో ధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబాల‌తో క‌లిసి కేటీఆర్ లంచ్ చేశారు.

Ktr

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం 18 కోట్ల పైచిలుకు రూపాయాల‌ను ఇన్సూరెన్స్ క‌డుతున్నామ‌ని కేటీఆర్ చెప్పారు. 950 మంది పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు వివిధ ప్రమాదాల్లో దుర్మర‌ణం పాల‌య్యారు. ఈ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీల‌తో పాటు ఎమ్మెల్యేలదే అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Read also: Huzurabad: టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా బరిలోకి.. హుజురాబాద్‌పై రేవంత్ వ్యూహాత్మక అడుగులు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!