AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: మాయదారి వడ్డీ డబ్బు.. పుస్తెల తాళి ఇచ్చినా, పతి దేవుడ్ని కాపాడుకోలేకపోయింది

నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.  వడ్డీ వ్యాపారి వేదింపులు తాళలేక నాగులు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Nizamabad: మాయదారి వడ్డీ డబ్బు.. పుస్తెల తాళి ఇచ్చినా, పతి దేవుడ్ని కాపాడుకోలేకపోయింది
Heavy Interesting Killing
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2021 | 5:06 PM

Share

నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.  వడ్డీ వ్యాపారి వేదింపులు తాళలేక నాగులు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బు కోసం వడ్డీ వ్యాపారి ఇంటి ముందు గొడవ చేయడంతో పరువు పోతుందని భావించిన నాగులు భార్య మెడలో ఉన్న పుస్తెల తాడు తీసి అతడికి ఇచ్చింది.  దాన్ని అవమానంగా భావించిన నాగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై నగరంలోని 3టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.  తెలిసిన వడ్డీ వ్యాపారి దగ్గర నాగులు గతంలో లక్ష యాభై వేల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది.

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని బాపూజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గిరీష్ అనే వ్యక్తి యువతిని కత్తితో పొడిచి… అనంతరం తాను కూడా గాయపరుచుకున్నాడు. తనను ప్రేమించాలని…పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు.  యువతి ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినబడడం వల్ల తాము వెళ్లి చూశామని స్థానికులు తెలిపారు. యువతీ, యువకుడు రక్తపుమడుగులో ఉన్నట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. యువతి స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నట్లు వివరించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… క్లూస్ టీం ఆధారంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో.. కనీసం మీ ఊహకు కూడా అందవు

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి