Actor Murali Mohan: సినీనటుడు మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు, జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులకు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది.

Actor Murali Mohan – High court: టాలీవుడ్ సీనియర్ నటుడు, జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులకు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. తన దగ్గర స్థలం తీసుకుని మోసం చేశారని ఒక భూయజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయభేరీ ప్రాపర్టీస్ అధినేత మురళీమోహన్ తోపాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు నమోదు చేసిన ఎపీ సీఐడీ.. 41A సెక్షన్ కింద నోటీసు ఇచ్చి గురువారం విచారణకు హాజరు కావాలని కోరిన సంగతి తెలిసిందే.
అయితే, దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన మురళీ మోహన్, అతని కుటుంబ సభ్యులు సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టులో క్వ్యాష్ పిటీషన్ వేశారు. మురళీ మోహన్ తరపున క్వ్యాష్ పిటీషన్ వేసి సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తన క్లయింట్ తరపు వాదనలు హైకోర్టుకు వినిపించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చడం పట్ల హైకోర్టు ముందు మురళీ మోహన్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాదు, జయభేరీ ప్రాపర్టీస్ సంస్థ సదరు వ్యక్తితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం ఉల్లంఘించలేదని మురళీ మోహన్ తరపు న్యాయవాది దమ్మాలపాటి పేర్కొన్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో అన్ని రకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Ap High Court
Read also: OU Lands: ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్నంటూ విద్యార్థి లేఖపై హైకోర్టు విచారణ.. ప్రభుత్వ వివరణ ఇదీ..