Suriya’s ‘Jai Bhim’: మరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిన సూర్య.. త్వరలోనే స్ట్రీమింగ్

చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూసిన సూర్య ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సుధా కొంగరు దర్శకత్వం వహించిన..

Suriya's 'Jai Bhim': మరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిన సూర్య.. త్వరలోనే స్ట్రీమింగ్
Jai Bheem
Follow us

|

Updated on: Aug 05, 2021 | 6:57 PM

Suriya’s  ‘Jai Bhim’: చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూసిన సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సుధా కొంగరు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై  మంచి విజయం అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతో మరోసారి నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు సూర్య. ఇక ఇప్పుడు జై భీమ్‌‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో లాయర్‌‌‌గా కనిపించనున్నాడు సూర్య . గిరిజనుల కోసం పోరాడే పవర్ ఫుల్ లాయర్ కథ ఇది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా రియల్ హీరో కథ అని అంటున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌‌‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.

అయితే గతంలో ఆకాశం నీహద్దురా సినిమాను థియేటర్స్ ఓపెన్ అయ్యేంతవరకు వేచిచూడకుండా ఓటీటీ ద్వారా విడుదల చేశారు సూర్య. ఆ సమయంలో సూర్య పై పలు విమర్శలు కూడా వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ థియేటర్ యాజమాన్యాలు సూర్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన సినిమాను ఓటీటీలోనే విడుదల చేశారు సూర్య. ఇక ఇప్పుడు జై భీమ్ సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ‘జై భీమ్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సూర్య సరసన ‘కర్ణన్’ ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో సురేఖ వాణి.. క్లూ ఇచ్చిన నటి.. అందుకే పోస్ట్‌‌‌‌‌ను డిలీట్ చేశారా..?

Raj Kundra: రాజ్ కుంద్రా చెప్పింది ఒక్కటి చేసింది మరొకటి.. పోర్న్ కేసులో బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరోతో కియారా అద్వానీ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..