AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బందిపోటు’ సినిమాకు 33 ఏళ్లు.. ఆ సినిమాతోనే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టానన్న సుమన్

హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సుమన్ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించారు. అన్నమయ్య సినిమాలో..

‘బందిపోటు’ సినిమాకు 33 ఏళ్లు.. ఆ సినిమాతోనే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టానన్న సుమన్
Suman
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2021 | 6:20 PM

Share

Bandipotu movie : హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సుమన్ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గా మారి పలు సినిమాల్లో నటించారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, రామదాసు సినిమాలో శ్రీరాముడిగా నటించి ప్రేక్షకులను మైమరపించారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్‌‌‌‌గానూ మెప్పించారు సుమన్. ఇదిలా ఉంటే సుమన్ హీరోగా నటించిన ‘బందిపోటు’ సినిమా 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. సుమన్ నటించిన యాక్షన్ మూవీ ‘బందిపోటు’. అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ ప్రసాద్ సమర్పణలో టీఆర్ తులసి ఈ చిత్రాన్ని నిర్మించారు. బి.ఎల్వీ. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘బందిపోటు’ చిత్రం 1988 ఆగస్టు 4న విడుదలైంది. గౌతమి, కల్పన, పూర్ణిమ, శివకృష్ణ, కోటాశ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, సుత్తి వీరభద్రరావు, రంగనాథ్, నర్రా వేంకటేశ్వరరావు, డిస్కో శాంతి, చంద్రిక, మోహన్ కుమార్, వినోద్, ఓంకార్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించిన ఈ చిత్రం పాటలు హిట్‌గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంతో సుమన్‌కు కూడా హీరోగా మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి విష్ చేయడం విశేషం.

ఈ సందర్బంగా హీరో సుమన్ మాట్లాడుతూ .. ఈ రోజు చాలా స్పెషల్ డె.. 33 సంవత్సరాలకు ముందు ఈ రోజు బందిపోటు సినిమా విడుదలైంది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఆ ఈ సినిమాతో నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రసాద్ గారికి కూడా మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయింది. గ్రేట్ టెక్నీషియన్స్ చేసిన సినిమా ఇది. కాట్రగడ్డ ప్రసాద్ గారి నిర్మాణంలో బి. ఎల్వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా గట్టి పోటీ మధ్య విడుదలై పెద్ద విజయం అందుకోవడం మరచిపోలేని అనుభూతి. చాలా రోజుల తరువాత గుర్తొచ్చింది. నాతో హీరోయిన్ గా గౌతమి మొదటి సారి నటించారు. ఈ సినిమా టి ఎల్ వి ప్రసాద్ గారు గ్రేట్ డైరెక్టర్ చాలా టెక్నీకల్ గా చేసారు. నిజంగా ప్రసాద్ గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలా ధైర్యం చేసి నాతొ సినిమా చేసారు. ఈ సినిమా నాకు సెకండ్ ఇన్నింగ్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత నేను వరుసగా అవకాశాలు అందుకున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ కు చిరంజీవి గారు వచ్చి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ అందరికి మరోసారి థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

(డా.చల్లా భాగ్యలక్ష్మి, TV9 తెలుగు, ET Desk)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో సురేఖ వాణి.. క్లూ ఇచ్చిన నటి.. అందుకే పోస్ట్‌‌‌‌‌ను డిలీట్ చేశారా..?

Raj Kundra: రాజ్ కుంద్రా చెప్పింది ఒక్కటి చేసింది మరొకటి.. పోర్న్ కేసులో బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరోతో కియారా అద్వానీ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..