Prakash Raj: ‘తెగేదాకా లాక్కండి’.. మోనార్క్ ట్వీట్‌తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ

తెగేదాకా లాక్కండి.. ఇది సినిమా డైలాగ్‌ కాదు. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్‌ రాజ్ లెటెస్ట్ ట్వీట్‌. మా లో గొడవలు, ఈగోలు, క్లాషెస్ లేవంటూనే...

Prakash Raj: 'తెగేదాకా లాక్కండి'.. మోనార్క్ ట్వీట్‌తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ
Prakash Raj


తెగేదాకా లాక్కండి.. ఇది సినిమా డైలాగ్‌ కాదు. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్‌ రాజ్ లెటెస్ట్ ట్వీట్‌. మా లో గొడవలు, ఈగోలు, క్లాషెస్ లేవంటూనే ట్వీట్లతో సిట్యువేషన్‌ని యమ హాట్‌గా మార్చేస్తున్నారు ప్రకాష్ రాజ్‌. ఈ ఒక్క ట్వీట్‌ టాలీవుడ్‌ సర్కిల్‌లో దుమ్ము రేపుతోంది. సూటిగా సుతిమెత్తగా పెట్టిన ఈ ట్వీట్‌.. ఎవరిని తాకాలో వారినే టచ్ చేసిందన్న చర్చ కూడా రచ్చ చేస్తోంది. ఎన్నికలను ఉద్దేశించే ఈ ట్వీట్ పోస్ట్ చేశారని భావిస్తున్న ఓ ప్యానెల్‌.. రెచ్చగొట్టొద్దంటూ ఇండైరెక్ట్‌గా పంచ్ లేస్తోంది. ఎలక్షన్స్‌ ఎప్పుడు జరుగుతాయో తెలియదు.. కానీ ఈ లోగానే ప్యానళ్ల కలలు, కలహాలు పీక్‌కి వెళ్తున్నాయి.

మోనార్క్‌ పేల్చిన ట్వీట్‌ బాంబు మళ్లీ అగ్గిరాజేస్తోంది. చల్లబడిందనుకున్న మ్యాటర్‌ని మళ్లీ తట్టిలేపారాయన. తెగేదాకా లాక్కండి అని పోస్ట్‌ పెట్టి.. జస్ట్ ఆస్కింగ్ అని ట్యాగ్‌ని తగిలించారు. అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన తర్వాత ప్రకాష్‌ రాజ్ రెండో ట్వీట్ ఇది. ఎన్నికల కోసం ఆయన ఎంతగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో ఈజీగా అర్థమవుతోంది. ఇప్పటికే 27మందితో ప్యానెల్‌ని ప్రకటించిన ప్రకాష్ .. ప్రెస్‌మీట్‌తో తానేంటి.. తన ప్యానల్ ఆశయమేంటో చెప్పకనే చెప్పేశారు.

తెగేదాకా లాక్కండి అన్న ట్వీట్‌ ప్రకాష్‌ ఎందుకు పోస్ట్‌ చేశారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అవి అనుకున్న ప్రకారం జరుగుతాయా? లేదంటే పోస్ట్‌పోన్ చేస్తారా? వాయిదా వేస్తారనే అనుమానాలతోనే ప్రకాష్‌ రాజ్ ఈ ట్వీట్‌ చేశారా? ఒకవేళ వాయిదా వేయాలనుకునే వారికి ఈ ట్వీట్‌ ఒక వార్నింగ్‌ లాంటి సంకేతమా అన్న చర్చ నడుస్తోంది. ఇంతకుముందు కూడా ప్రకాష్‌ రాజ్‌.. ఎలక్షన్ ఎప్పుడని ట్వీట్ చేశారు. ఇప్పుడేమో తెగేదాకా లాక్కండని అన్నారు. ఈ వరుస ట్వీట్ల దూకుడు వెనుక మతలబు ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం మా ఎలక్షన్స్. గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ఈ చర్చనే నడుస్తోంది. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం తన ప్యానల్ సభ్యులను ప్రకటించేసి దూకుడు ప్రదర్శించారు. దీంతో కొందరు సినీ ప్రముఖుల సెప్టెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలకు ఇప్పుడే హడావిడి ఎందుకని విమర్శించారు. ఈ క్రమంలోనే మా ఎన్నికలపై మురళీ మోహన్ చేసి కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఈ సారి మా ఎన్నికల్లో పోటీ అనేది ఉండదని.. ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మురళీ మోహన్. చిరంజీవి, మోహన్ బాబు, జయసుధలతో చర్చలు జరిపి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పడంతో సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో ప్రకాష్‌ వరుస ట్వీట్లు మరింత ఆసక్తిరేపుతున్నాయి. ఏకగ్రీవానికి సుముఖంగా లేమని ఎన్నికలకు వెళ్లడం ఖాయం అనేలా ట్వీట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే

 ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ దందా.. బాల్‌కో జీవితం నాశనం.. కట్ చేస్తే..

Click on your DTH Provider to Add TV9 Telugu