AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ దందా.. బాల్‌కో జీవితం నాశనం.. కట్ చేస్తే..

మరో బెట్టింగ్ ముఠా దెబ్బకు ఠా అంది. గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాదిక్ గ్యాంగ్‌ పని పట్టారు రాచకొండ ఎస్వోటీ పోలీసులు...

Hyderabad:  ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ దందా.. బాల్‌కో జీవితం నాశనం.. కట్ చేస్తే..
Cricket Betting
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2021 | 7:37 PM

Share

మరో బెట్టింగ్ ముఠా దెబ్బకు ఠా అంది. గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాదిక్ గ్యాంగ్‌ పని పట్టారు రాచకొండ ఎస్వోటీ పోలీసులు… ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ షేక్‌ సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 95 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీస్‌ సీజ్ చేశారు. 15లక్షల 70 వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు, 28 క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సాదిక్‌ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్‌ అకౌంట్‌లను కూడా గుర్తించారు. ఈ అకౌంట్లలోని 69 లక్షల 63వేల నగదుని కూడా సీజ్ చేశారు. 8 టీమ్, ఎమ్‌బి మ్యాక్స్, ఇన్‌ప్లే బెట్, యూఏఈ బెట్ వంటి యాప్‌ల ద్వారా ఈ ముఠా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు.

మొదట ఈ యాప్‌లకు సబ్‌స్క్రైబ్‌ చేసుకొని బుకీల నుంచి ఐడీలు, పాస్‌వర్డ్‌లు తీసుకుంటాడు సాదిక్. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఇంట్రెస్ట్ చూపుతున్న ఫంటర్స్‌ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. మ్యాచ్‌ జరిగే సమయంలో లింకులను ఫంటర్స్‌కు పంపి.. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ఆ తర్వాత నేరుగా ఆన్‌లైన్‌లో బుకీలతో బెట్టింగ్‌లు కాస్తుంటాడు. ఫంటర్స్‌ బెట్టింగ్‌లో గెలిస్తే వారి నుంచి 30శాతం కమిషన్ కూడా తీసుకుంటున్నాడు సాదిక్. టాస్‌ విన్నింగ్‌ నుంచి మొదలు పెడితే… మ్యాచ్ ముగిసేవరకు బాల్‌ టు బాల్ బెట్టింగ్‌ ఉంటుంది. నిందితులు ఇలా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు రాచకొండ ఎస్వోటీ పోలీసులు. సాదిక్ నుంచి సేకరించిన కీలక సమాచారం ద్వారా ఎస్వోటీ పోలీసులు మరికొన్ని బెట్టింగ్‌ ముఠాలకు చెక్‌ పెట్టే పనిలో ఉన్నారు.

Also Read:రేపే టెన్త్ క్లాస్ రిజల్ట్స్.. ప్రకటించిన ఏపీ విద్యాశాఖ

మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి